/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-14-jpg.webp)
Pawan Kalyan Congratulated Ram Charan : మెగా హీరో రామ్ చరణ్‌కు డాక్టరేట్ (Doctorate) లభించడంపై జనసేన అధినేత, సీనియర్ హీరో పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా అన్న కొడుకును పొగుడుతూ హార్ట్ టచింగ్ పోస్ట్ షేర్ చేశారు. ఈ మేరకు 'చలనచిత్ర రంగంలో తనదైన పంథాలో పయనిస్తూ గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు సాధించిన రామ్ చరణ్‌కు గౌరవ డాక్టరేట్ రావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. రామ్ చరణ్‌కు మనస్ఫూర్తిగా అభినందనలు. డాక్టరేట్ స్ఫూర్తితో రామ్ చరణ్ మరిన్ని విజయవంతమైన చిత్రాలు చేయాలని.. మరెన్నో పురస్కారాలు, మరింత జనాదరణ పొందాలని ఆకాంక్షిస్తున్నాను' అంటూ పవన్ ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
రామ్ చరణ్ కు అభినందనలు - JanaSena Chief Shri @PawanKalyan @AlwaysRamCharan#RamCharan pic.twitter.com/UGgMvC9KzO
— JanaSena Party (@JanaSenaParty) April 12, 2024
వేల్స్ యూనివర్సిటీ నుంచి..
ఇక చెన్నైకి చెందిన వేల్స్ విశ్వవిద్యాలయం చెర్రీకి గౌరవ డాక్టరేట్ ప్రకటించగా.. ఏప్రిల్ 13న జరగనున్న వేల్స్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ఈ డాక్టరేట్ ను ప్రదానం చేయనున్నారు. ఏప్రిల్ 13న జరిగే ఈ స్నాతకోత్నవం సినీ నిర్మాత, యూనివర్సిటీ ఛాన్సలర్ ఈసారి గణేశ్ అధ్యక్షతన జరనుండగా.. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రామ్ చరణ్ హాజరకానున్నారు. కళా రంగానికి రామ్ చరణ్ చేస్తున్న సేవలకు గుర్తింపు ఈ డాక్టరేట్ ప్రకటించారు. ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అధ్యక్షుడు డీజీ సీతారాం అందించనున్నారు.