Pawan Kalyan: టీడీపీ ఏకపక్షంగా అభ్యర్ధులను ప్రకటించడం సరికాదు.. పవన్ కళ్యాణ్ సీరియస్..!

టీడీపీ ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. పొత్తు ధర్మం ప్రకారం ఏకపక్షంగా అభ్యర్ధులను ప్రకటించకూడదన్నారు. సర్దుబాటుకు ముందే అభ్యర్ధుల్ని ప్రకటించడం సరికాదని సూచించారు.

Pawan Kalyan: టీడీపీ ఏకపక్షంగా అభ్యర్ధులను ప్రకటించడం సరికాదు.. పవన్ కళ్యాణ్ సీరియస్..!
New Update

Pawan Kalyan: టీడీపీ-జనసేన పొత్తులో (TDP-Janasena Alliance) కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మండపేట, అరకు అభ్యర్థులను టీడీపీ ఏకపక్షంగా ప్రకటించడంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీరియస్ గా స్పందించారు. పొత్తు ధర్మం ప్రకారం టీడీపీ సీట్లు అనౌన్స్ చేయకూడదని అన్నారు. సర్దుబాటుకు ముందే అభ్యర్ధుల్ని ప్రకటించడం సరికాదని సూచించారు. టీడీపీ సీట్లు అనౌన్స్ చేయడం పార్టీలోని కొందరు నేతలను ఆందోళనకు గురి చేసిందని వ్యాఖ్యనించారు. అందుకు పార్టీ నేతలకు తాను క్షమాపణలు చెప్పారు. టీడీపీకి పోటీగా రెండు స్థానాలు ప్రకటించారు పవన్ కళ్యాణ్. రాజోలు (Razole), రాజానగరం (Rajanagaram) లో జనసేన పోటీ చేస్తుందని డిక్లేర్ చేశారు.

సొంత చెల్లినే వదల లేదు.. 

50, 60 స్థానాలు తీసుకోవాలంటే అవన్నీ తనకు తెలియనివి కావన్నారు. తాను ఒక్కడినే ఎందుకు వెళ్ళలేదనే విషయంలో అవగాహన ఉందని..ఎన్ని స్థానాలు తీసుకోవాలో తనకు తెలుసని వ్యాఖ్యనించారు. మనం సింగిల్ గా వెళ్తే సీట్లు సాధిస్తాం కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని అన్నారు. జగన్ (CM Jagan) అనే వ్యక్తి టీడీపీని టార్గెట్ చేయడంతో పాటు మనల్ని వదలడం లేదని కామెంట్స్ చేశారు. సొంత చెల్లిని వదలని వ్యక్తి మనల్ని వదులుతాడా? అంటూ ప్రశ్నించారు. వైఎస్ జగన్ కు ఊరంతా శతృవులేనని అన్నారు. వైసీపీ నేతలకు కష్టం వస్తే తన దగ్గరకు రావాలని ఆ పార్టీ నేతలకు సూచించారు.

Also Read: ‘నారీశక్తి’ పేరుతో మహిళా శక్తిని చాటుతున్న గణతంత్ర వేడుకలు

అర్దం చేసుకోవాలి

లోకేష్ (Lokesh) సీఎం పదవి గురించి మాట్లాడిన తాను పట్టించుకోలేదని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనలు దృష్టికి పెట్టుకొని తాను మౌనంగా ఉంటున్నట్లు తెలిపారు. సీనియర్ నేతగా ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అలా జరుగుతూ ఉంటాయని అన్నారు పవన్ (Pawan Kalyan). అయితే, అనుకోకుండా కొన్ని జరుగుతాయి వాటిని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని నేతలకు సూచించారు. పార్టీ నేతలు అర్దం చేసుకోవాలని కోరారు. పొత్తును ఇబ్బందులకు గురి చేసేలా కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. జగన్ ప్రభుత్వం 2024 లో మళ్ళీ అధికారంలోకి రాకూడదని..టీడీపీ జనసేన కలిస్తే బలమైన నిర్మాణం తీసుకొవచ్చని చెప్పుకొచ్చారు.

#janasena-chief-pawan-kalyan #chandrababu #andhra-pradesh #pawan-kalyan #tdp-janasena-allinace
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి