Pawan Kalyan Birthday: హీరోలకు అభిమానులుంటారు.. కానీ పవన్ కళ్యాణ్ కు భక్తులుంటారు అని చాలా మంది దర్శకులు చెబుతుంటారు. ఇది కేవలం డైలాగ్ మాత్రమే ఇదే నిజం అన్నట్లుగా పవన్ చరిష్మా కొనసాగుతుంది. ఒక్క సినిమా ఫ్లాప్ అయితేనే.. ఇక ఆ హీరోను పట్టించుకొని రోజులివి. కానీ పవర్ స్టార్ మాత్రం దీనికి అతీతుడు అనే చెప్పాలి. ఎన్ని ఫ్లాపులు వచ్చినా.. పవన్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు సరికదా ఇంకా పెరుగుతూనే ఉంది. అందుకేనేమో ఆయనకు భక్తుంటారు అని చెబుతారు. పవన్ కళ్యాణ్ కు హిట్లు, ఫ్లాపులు ఉండవు... అభిమానులు మాత్రమే ఉంటారనే అనే స్థాయిలో ప్రేక్షకుల మనసులను గెలిచిన పవర్ స్టార్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
ట్రెండ్ సెట్టర్
నేను ట్రెండ్ ఫాలో అవ్వను ట్రెండ్ సెట్ చేస్తాను.. ఇది పవర్ స్టార్ సినీ కేరీర్ కు సరిగ్గా సరిపోయే డైలాగ్. మెగాస్టార్ తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవన్ తనకంటూ సెపెరెట్ ఇమేజ్ సంపాదించుకున్నారు. కేరీర్ తొలి నాళ్లలోనే తొలిప్రేమ, బద్రి, ఖుషి, తమ్ముడు సినిమాల్లో తనదైన మ్యానరిజంతో.. యాటిట్యూడ్ తో.. స్టైల్ తో హీరోగా సరి కొత్త ట్రెండ్ చేశాడు.
తొలిప్రేమ లక్షల మంది కుర్రాళ్ళను పవన్ ప్రేమలో పడేలా చేసింది. తొలి ప్రేమతో అతన్ని అభిమానించడం మొదలు పెట్టిన ఎంతో మందికి బద్రి, ఖుషీతో పవన్ మేనియా సోకింది . 'సిద్దు..సిద్దార్థ్ రాయ్', 'నువ్వు నంద అయితే.. నేను బద్రి.. బద్రీనాథ్' అనే డైలాగ్స్ యువతను ఓ ఊపు ఊపాయి.
ఏ మాత్రం తగ్గని క్రేజ్
2001 ఖుషితో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన పవన్ ఆ తర్వాత జానీ సినిమా తీసి దర్శకుడిగా కూడా నిరూపించుకున్నారు. ఇక జానీ తర్వాత పవర్ కేరీర్ లో వరుస ఫ్లాపులు మొదలయ్యాయి. గుండ్రంగా వుండేదే భూమి, కాలేదే నిప్పు, పోరాడే వాడే మనిషి. నువ్వు మనిషివైతే జీవితంతో పోరాడు అని బాలు సినిమాలో పవన్ చెప్పిన డైలాగ్ మాదిరిగా..హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ వచ్చాడు పవన్. వరుసగా 8 ఫ్లాపులు వచ్చిన పవన్ క్రేజ్ మాత్రం తగ్గలేదు కదా.. ఇంకా పెరుగుతూనే ఉంది. అందుకే పవన్ కు అభిమానులు కాదు, భక్తులుంటారు అని చెబుతారు కావచ్చు. ప్రతీ సినిమాలో ఆయనలో కనిపించే వెరియేషన్, స్టైల్, మ్యానరిజం ఆయన్ను కొత్తగా పరిచయం చేశాయి.
మళ్ళీ దాదాపు పదేళ్ల తర్వాత పవన్ స్థాయికి తగ్గ హిట్టు పడింది. 2012లొ గబ్బర్సింగ్ బారీ విజయాన్ని అందుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది.
రాజకీయాలు
సినీ రంగలో అతి తక్కువ సినిమాలతోనే మెగాస్టార్ దీటుగా తనకంటూ సపేరేట్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న పవన్.. రాజకీయాల్లోనే తన సత్తాచాటాడు. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు అంటూ రీల్ లైఫ్ లో చెప్పిన డైలాగ్ రియల్ లైఫ్ లోనూ నిజం చేశాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఏపీ ఎన్నికలో కేవలం 21 సీట్లను మాత్రమే తీసుకున్నందుకు తన పై ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ ఏ మాత్రం నిరూత్సాహ పడకుండా.. దైర్యంగా ముందుకెళ్లి 21/21 సీట్లు గెలిచి ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించాడు. ప్రస్తుతం ఎపీ డిప్యూటీ సీఎం బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Also Read: సీఎం రేవంత్‌ను అభినందించిన మోదీ.. హెలికాప్టర్లు పంపిస్తామని హామీ!