TDP - Janasena Alliance: వచ్చే ఎన్నికల్లో జనసేన- తెలుగుదేశం వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీచేస్తాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అధికారికంగా ప్రకటించారు. రేపటి నుంచి టీడీపీ-జనసేన నేతలు, కార్యకర్తలు కలిసి పనిచేసేలా కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. రాజమండ్రి జైలులో చంద్రబాబును కలిసిన అనంతరం పవన్ కల్యాణ్, హీరో బాలకృష్ణ, టీడీపీ యువనేత నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు.
రాజమండ్రి జైలు వద్ద పవన్ కల్యాణ్ ప్రసంగం..
☛ చంద్రబాబుతో ముగిసిన బాలయ్య, పవన్ ములాఖత్
☛ దాదాపు 40 నిమిషాలు సేపు చంద్రబాబుతో మీటింగ్
☛ నాలుగున్నరేళ్లుగా ఏపీలో అరాచక పాలన నడుస్తోంది
☛ చంద్రబాబుపై అక్రమంగా కేసులు పెట్టారు
☛ చంద్రబాబును రిమాండ్‌లో జైలుకు పంపడం బాధాకరం
☛ నా సానుభూతి ప్రకటించేందుకు ఇక్కడికి వచ్చా
Also Read: జైల్‌కి వెళ్ళింది అందుకే..జనసేనానిపై వైసీపీ విమర్శనాస్త్రాలు..!!
☛ మోదీ లాంటి నాయకుడు దేశానికి అవసరం కాబట్టే ఆయనకు 2014లో మద్దతు ఇచ్చాను
☛ చంద్రబాబుతో నాకు వ్యక్తిగత విభేదాలు లేవు.. పాలసీ విభేదాలతోనే బయటకు వచ్చా
☛ ఆయన అనుభవాన్ని ఏరోజు నేను ప్రశ్నించలేదు
☛ బాబు నాయకత్వంతోనే హైదరాబాద్‌లో ఐటీ ఇండస్ట్రీ అంత అభివృద్ధి చెందింది
☛ అలాంటి విజన్ ఉన్న నాయకుడు దేశానికి అవసరం
☛ లక్ష కోట్ల రూపాయలు ఆదాయం వస్తున్న సైబరాబాద్‌ను సిటీ నిర్మించిన వ్యక్తి చంద్రబాబు
☛ కేవలం రూ.371కోట్ల కేసులో చంద్రబాబును ఇరికించడం హాస్యాస్పదం
☛ క్రిమినల్ కేసులు ఉన్న జగన్ చంద్రబాబుపై కేసు మోపడం విడ్డూరం
☛ విదేశాలకు వెళ్లాలంటే కోర్టు పర్మిషన్ తీసుకునే వ్యక్తి జగన్
☛ అవినీతి బూరదలో కూరుకుపోయిన వ్యక్తి.. అందరికి బురద అంటిస్తున్నాడు
☛ సొంత రాష్ట్రానికి రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు
☛ పోలీసులకు కూడా చెబుతున్నాను మీరు కూడా చట్టప్రకారం నడుచుకోవాలి
☛ సొంత బాబాయ్ వివేకా హత్య కేసులో ఒక్కరు కూడా జైలుకు వెళ్లలేదు
☛ అక్రమంగా భూ కబ్జాలు చేస్తున్నా వ్యక్తులపై కేసులు పెట్టడం లేదు
☛ గుజరాత్ పోర్టులో రూ.3వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకుంటే.. దాని మూలాలు విజయవాడలో ఉన్నాయి
☛ ఇంతవరకు పోలీసులు ఆ కేసును పట్టించుకోవడం లేదు
☛ చంద్రబాబు అరెస్టును పూర్తిగా ఖండిస్తున్నాను
☛ జైలులో చంద్రబాబుతో ములాఖత్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నూతన ఒరవడి కాబోతుంది
☛ వైసీపీ నాయకులను హెచ్చరిస్తున్నా.. ఏ ఒక్కరిని వదలం
☛ సొంత చెల్లి, బావ, అమ్మను వదిలేసిన వ్యక్తి జగన్
☛ సొంత బాబాయ్ ని చంపిన వ్యక్తికి ఉన్నతాధికారులు మద్దతు పలికి సమస్యలు కొనితెచ్చుకోవద్దు
☛ జగన్‌ను నమ్ముకున్న వైసీపీ నాయకులు, ఉన్నతాధికారులకు చెబుతున్నాను.. ఏ ఒక్కరినీ వదలం
☛ పోలీసు వ్యవస్థ ఇంత బానిసత్వంగా ఉంటే ఎవరేం చేయలేరు
☛ మీకు ఆరు నెలలు మాత్రమే సమయం ఉంది
☛ మీకు యుద్ధమే కావాలంటే యుద్ధానికి సిద్ధం
☛ రేపు అధికారంలోకి వచ్చాక అందరి తాట తీస్తాం
☛ ఇసుక దోపిడీ, మద్యం కుంభకోణం, భూకబ్జాలు చేస్తున్న నాయకులను జైలులో కూర్చోపెడతాం
☛ ఎన్‌సీజీ భద్రత ఉన్న చంద్రబాబుకు జైలులో మరింత భద్రతపై కల్పించాలి
☛ ఆయన భద్రతపై ఆందోళనగా ఉంది
☛ చంద్రబాబు అరెస్ట్ వెనక కేంద్ర పెద్దల హస్తం ఉంది అని అనుకోవడం లేదు
Also Read: యుద్ధానికి రెడీ.. ఇప్పటి నుంచి ఓ లెక్క.. ఇక నుంచి ఓ లెక్క అంటున్న టీడీపీ-జనసేన