AP: ఏపీలో కూటమి పార్టీలు ఘన విజయాన్ని సాధించాయి. కూటమిలో జనసేన 21 స్థానాల్లో పోటీకి నిలిచి 21 స్థానాల్లోనూ గెలిచి విజయకేతానాన్ని ఎగరవేసింది. విజయం సాధించిన తర్వాత తాజాగా పవన్ కళ్యాణ్ తాజాగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. నేడు ఒక చారిత్రాత్మక రోజని ఆయన పేర్కొన్నారు. ఏదైతే ప్రజలకు చెప్పి అధికారంలోకి వచ్చామో అదే కచ్చితంగా నెరవేరుస్తామని ఆయన వివరించారు. ముఖ్యంగా ఓ జవాబుదారు ప్రభుత్వంగా పనిచేస్తామని, ఐదు కోట్ల ప్రజల భవిష్యత్తుకు పునాదులు వేయడానికి కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.
ఇక ఈ మాటల్లో ఆయన వైయస్ జగన్ నాకు వ్యక్తిగత శత్రువు కాదు. ఆయనను ఇబ్బంది పెట్టడానికి మేము అధికారంలోకి రాలేదని, వైసీపీ పార్టీకి భవిష్యత్తులో ఇబ్బంది పెట్టే ప్రసక్తే లేదని ఆయన తెలిపారు. ఈ ఘన విజయంతో ఏపీ ప్రజలకు మంచి చేయడానికి కృషి చేస్తామని పవన్ కళ్యాణ్ మాట్లాడారు. జనసేన పార్టీ నేతలు కార్యకర్తలు ఎవరు కూడా ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడకూడదని ఆయన ఈ సందర్భంగా అన్నారు.
ఆంధ్రాలో ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో ఉండే మనిషి కష్టాన్ని నేను స్వయంగా చూశాను. 2019లో ఓడిపోతే నా మానసిక స్థితి ఎలా ఉందో ఇప్పుడు గెలిచాక కూడా నా మానసిక స్థితి అట్లాగే ఉందని పవన్ అన్నారు. మీరు గుండెల్లో పెట్టుకొని ఓడిపోతేనే ఇంత బాగా నిలబడ్డవాడిని.. మీరంతా కలిసి ఆకాశమంత ఉత్సాహం ఇచ్చారు. ఇప్పుడు గుండెల్లో పెట్టుకుంటాను.
నిలబెడతాం నిర్మాణాత్మకంగా పనిచేస్తాం. మీ కష్టాలలో మీ ఇంట్లో ఒకటిలా నేను ఉంటానని మాట ఇస్తున్నానని పవన్ అన్నారు. మీ ఇంట్లో ఒకడిగా ఒకటే గుర్తుపెట్టుకోండి... మా ఇంట్లో మా కుటుంబ సభ్యుడని, నాకు కులాలకు, మతాలకు ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు మా కుటుంబంలో పవన్ కళ్యాణ్ ఒకడు అనుకోవాల్సిందే అని పవన్ అన్నారు.
మీకోసం మా కష్టాల కోసం నిలబడుతున్నాడు.. అది నేను చేసి చూపిస్తాను, ప్రభుత్వం ఎలా ఉండాలి అధికార యంత్రం ఎలా ఉండాలి రాబోయే రోజుల్లో మీకందరికీ చేసి చూపిస్తాం అంటూ తెలిపాడు.