ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.... లారీని ఢీ కొట్టిన బస్సు..... 30 మందికి గాయాలు..!

ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొయ్యల గూడెం పులివాగు శివాలయం వద్ద ఆర్టీసీకి చెందిన పల్లె వెలుగు బస్సు ఒకటి లారీని ఢీ కొట్టింది. లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. జంగారెడ్డి గూడెం నుంచి వాడపల్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది వరకు ప్రయాణికుులు ఉన్నారు.

ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.... లారీని ఢీ కొట్టిన బస్సు..... 30 మందికి గాయాలు..!
New Update

ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొయ్యల గూడెం పులివాగు శివాలయం వద్ద ఆర్టీసీకి చెందిన పల్లె వెలుగు బస్సు ఒకటి లారీని ఢీ కొట్టింది. లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. జంగారెడ్డి గూడెం నుంచి వాడపల్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది వరకు ప్రయాణికుులు ఉన్నారు.

ఈ ప్రమాదంలో సుమారు 30 మందికి గాయాలయ్యాయి. దీంతో వారందరినీ కొయ్యలగూడెం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మొదట బాధితులకు చికిత్స అందించడంలో వైద్యులు నిర్లక్ష్యం వహించారని బాధితులు ఆరోపించారు. ఈ మేరకు వైద్యులతో వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత వారికి వైద్యులు చికిత్స అందించడంతో సమస్య సద్దుమణిగింది.

మిగితా ప్రయాణికులను వేరే బస్సులో ఎక్కించి వారి గమ్యస్థానాలకు ఆర్టీసీ అధికారులు చేర్చారు. ఇది ఇలా వుంటే నంద్యాల జిల్లాలో కారు ఒకటి బీభత్సం సృష్టించింది. డోన్​ పట్టణంలోని అతివేగంతో దూసుకు వచ్చిన కారు రోడ్డుపై వెళ్తున్న రెండు బైక్ లను ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

అనంతరం వారిని మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూలు ఆస్పత్రికి తరలించారు. యాక్సిడెంట్ అనంతరం కారులోని వ్యక్తులు పారిపోయేందుకు ప్రయత్నించారు. ఇది గమనించిన స్థానికులు వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. మద్యం సేవించి అతి వేగంతో కారు నడపడంతోనే ప్రమాదం జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు.

#injured #accident #lorry #eluru #bus
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe