Indigo Flight:ఫ్లైట్ ఆలస్యం అయిందని..ఎయిర్ హోస్టెస్‌ని కొట్టిన ప్రయాణికుడు

ఈమధ్య కాలంలో ఫ్లైట్‌లలో ప్రయాణికుల గొడవ ఎక్కువవుతోంది. విదేశాల్లోనే కాదు మన దేశంలో కూడా ఎంతో మంది ఫ్లైట్‌లలో గొడవలు పడుతున్నారు.తాజాగా ఫ్లైట్ ఆలస్యం అయిందని ఇండిగో విమాన సిబ్బందిని కొట్టాడో ప్రయాణికుడు.

Indigo Flight:ఫ్లైట్ ఆలస్యం అయిందని..ఎయిర్ హోస్టెస్‌ని కొట్టిన ప్రయాణికుడు
New Update

Indigo Flight:బస్సుల్లో, రైళ్ళల్లో గొవడలు జరుగుతుంటాయి. బస్సులో సీట్ల కోసం కూడా కొట్టుకుంటారు. ఫ్లైట్‌లలో జనాలు డీసెంట్‌గా ఉంటారు అని అనుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు అక్కడ కూడా నానా హంగామా చేస్తున్నారు ప్రయాణికులు. కొంతమంది చెప్పడానికి కూడా వీలులేని పనులు చేస్తుంటే...మరికొంత మంది తోటి ప్రయాణికులతో, విమాన సిబ్బందితోనూ గొడవలు పడుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియోనే ఒకటి బయటకు వచ్చింది. ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు విమానం ఆలస్యానికి సంబంధించిన ప్రకటన చేస్తున్న ఎయిర్ హోస్టెస్‌ మీద దాడి చేశాడు. ఇండిగో విమానంలో జరిగిందీ ఘటన.

Also Read:వచ్చేసిందోచ్..మారుతి-ప్రభాస్ క్రేజీ కాంబో టైటిల్ రివీల్..అదిరిపోయిన డార్లింగ్ లుక్

చాలా ఆలస్యం అయిన విమానం..

ఈ మధ్య కాలంలో ఇండిగో విమానాలు చాలా ఆలస్యం అవుతున్నాయి. ఈ ఫ్లైట్‌ కూడా చాలా ఆలస్యం అయంఇది. తరువాత కూడా ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ నిబంధనల కారణంగా అంతకు ముందు ఉన్న సిబ్బంది వెళ్ళిపోయి కొత్త వారు వచ్చారు. కొత్తగా డ్యాటీలోకి వచ్చిన ఎయిర్ హోస్టెస్ ఆలస్యం విషయం అనౌన్స్ చేస్తుండగా...విమానం చివరలో ఉన్న వ్యక్తి పరుగెట్టుకుని వచ్చి మరీ ఆమె మీద దాడి చేశాడు. పసుపు రంగు హుడీ వేసుకుని ఉన్న వ్యక్తి కొట్టడం వీడియోలో స్పష్టంగా కనిపించాడు.

వైరల్ అయిన వీడియో...

సోషల్ మీడియాలో ఈ ఘటన ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇలా ఫ్లైట్ క్రూ మీద దాడి చేయడం నో ఫ్లైట్ లిస్ట్‌లో చేర్చాలని నెటిజన్లు అడుగుతున్నారు. ఇలా దారుణంగా ఎలా ప్రవర్తిస్తారని అంటున్నారు. ఆ వ్యక్తిని వెంటనే ఆరెస్ట్ చేయాలని కూడా చెబుతున్నారు. ఇండిగో 6E ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది అంటూ కామెంట్ చేశారు. అయితే ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ ఏ విమానంలో జరిగింది అనేది మాత్రం ఇంకా తెలియలేదు. వాతావరణం, పొగ మంచు కారణంగా ఈ మధ్య విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ రోజు కూడా 110 ఫ్లైట్‌లు ఆలస్యంగా నడుస్తుండగా, మరో 79 విమానాలు రద్దు అయ్యాయి.

#flight #tourist #indigo #air-hostes
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe