Delhi: కేంద్రం ఆమోదిస్తే ఢిల్లీలో కృత్రిమ వాన.. ఎంత ఖర్చు అవుతుందంటే..

కొన్ని రోజులుగా వాయు కాలుష్యంలో చిక్కుకున్న ఢిల్లీ వాసులకు గురువారం రాత్రి వర్షం కురిసి కాస్త ఉపశమానాన్ని ఇచ్చింది. ఇప్పటికే వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ సర్కార్ కృత్రిమ వర్షాన్ని కురిపించాలని నిర్ణయం తీసుకుంది. కేంద్రం ఆమోదిస్తే ఈ నెల 20 న కృత్రిమ వర్షాన్ని కురిపిస్తారు.

Delhi: కేంద్రం ఆమోదిస్తే ఢిల్లీలో కృత్రిమ వాన.. ఎంత ఖర్చు అవుతుందంటే..
New Update

దేశ రాజధాని ఢిల్లీ ప్రస్తుతం తీవ్ర వాయు కాలుష్యంతో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. అయితే గురువారం రాత్రి ఢిల్లీ, ఎన్సీఆర్‌ ప్రాంతాల్లో తేలికపాటి వర్షం పడి అక్కడి ప్రజలకు కాస్త ఉపశమనాన్ని ఇచ్చింది. ఇప్పటికే ఢిల్లీలో కొన్ని రోజులుగా నెలకొన్న ఈ వాయుకాలుష్యాన్ని తరిమేసేందుకు ఈ వర్షం కొంచె సహాయం చేసేందనే చెప్పుకోవచ్చు. అంతేకాదు ఇది ఢిల్లీ సర్కార్‌కు కూడా ఏ పెద్ద రిలీఫ్‌ను ఇచ్చింది. వాయు కాలుష్యం సమస్యను ఎదుర్కొనేందుకు గురువారం అక్కడి ప్రభుత్వం కృత్రిమ వర్షాన్ని కురిపించాలనే నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ అంశాన్ని పరిశీలన చేస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపితే.. ఈనెల 20న ఐఐటీ కాన్పూర్‌తో కలిసి మేఘమథనం జరిపి కృత్రిమ వర్షం కురిపిస్తామని అధికారులు చెబుతున్నారు.

Also Read: బీభత్సం సృష్టించిన కారు..ముగ్గురు మృతి..పదుల సంఖ్యలో క్షతగాత్రులు!

అయితే ఈ కృత్రిమ వర్షాన్ని కురిపించాలంటే ఢిల్లీ ప్రభుత్వానికి దాదాపు 13 కోట్ల వరకు ఖర్చు అవుతుందని తెలుస్తోంది. ఇక కేంద్ర ప్రభుత్వం దీనికి ఆమోదం తెలుపుతుందా లేదా అనేది చూడాలి. ఇదిలా ఉండగా.. ఢిల్లీలో వాయు కాలుష్య సూచీ 400 దాటిపోయింది. అయితే ఈ పరిస్థితి దీపావళి ముందు మెరుగుపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. గురువారం నాడు ఢిల్లీలో ఏక్యూఐ 437గా రికార్డ్‌ అయ్యింది. బుధవారం (426)తో పోలిస్తే కాస్త పెరిగింది. ఇక ఢిల్లీ చుట్టుపక్కల నగరాలైన గాజియాబాద్‌ (391), గురుగ్రామ్‌ (404), నోయిడా (394), గ్రేటర్‌ నోయిడా (439), ఫరీదాబాద్‌ (410)ల్లో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది.

Also Read: నా మూర్ఖత్వమే ఆయన్ను సీఎం చేసింది…జితన్ పై నితీశ్ కుమార్ వివాదస్పద వ్యాఖ్యలు..!!

#telugu-news #delhi #air-pollution
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe