Delhi Air Pollution: రోజురోజుకీ ఢిల్లీలో వాయ కాలుష్యం ఎక్కువైపోతోంది. పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం, వాహన ఉద్గారాల వల్ల గత ఏడు రోజులుగా కాలుష్య స్థాయిలు పడిపోతున్నాయి. గాలి నాణ్యత పెంచడానికి తక్షణమే ఉపాయం ఆలోచించాలని సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం నవంబర్ 20-21లో రెండు రోజుల పాటు ఢిల్లీలో కృత్రిమ వర్షం (Artificial Rain) కురిపించాలని ఆలోచిస్తోంది. దీనికోసం ఐఐటీ కాన్పూర్ (IIT Kanpur) బృందంతో ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ (Shri Gopal Rai), ఆర్ధిక మంత్రి అతిషి సమావేశమయ్యారు. కాలుష్యాన్ని నియంత్రించడానికి కృత్రిమ వర్షం కురిపించాలని ప్రతిపాదించారు. దీనికి సంబంధించిన ప్రణాళికను ఢిల్లీ ప్రభుత్వం ఐఐటీ కాన్పూర్ నిపుణులను కోరింది. ఈ ప్రణాళికను సుప్రీంకోర్టులో శుక్రవారం సమర్పించనుంది. కోర్టు దీనికి ఆమోదముద్ర వేస్తే ఈ పథకాన్ని అమలు చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
పూర్తిగా చదవండి..Delhi Air Pollution: ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించడానికి కృత్రిమ వర్షం
ఢిల్లీలో వాయుకాలుష్యాన్ని తగ్గించడానికి కృత్రిమ వర్షాన్ని కురిపించనున్నారా అంటే అవుననే చెబుతున్నారు. గత ఏడు రోజులుగా ఇక్కడ కాలుష్య స్థాయిలు విషమంగానే ఉన్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు.
Translate this News: