ఈరోజు నుంచే పార్లమెంట్ ప్రత్యేక భేటీ.

కొత్త పార్లమెంట్ లో నిర్వహించనున్న ప్రత్యేక సమావేశాలు ఈరోజు నుంచే మొదలవుతున్నాయి. ఐదు రోజులపాటూ ఈ సమావేశాలు జరగుతాయి. ఈరోజుకి పాత బిల్డింగ్ లోనే భేటీ జరుగుతుంది. రేపు వినాయకచవితి సందర్భంగా కొత్త పార్లమెంటుకు ఉభయ సభలూ మారతాయి.

New Update
ఈరోజు నుంచే పార్లమెంట్ ప్రత్యేక భేటీ.

కొత్త పార్లమెంటులో ప్రత్యేక సమావేశాలకు సర్వం సిద్ధం అయింది. భేటీలో మొదటి రోజు 75 ఏళ్ళ ప్రయాణం మీద చర్చించనున్నారు. దీంతో పాటూ పలు కీలక బిల్లుల కూడా చర్చిస్తారని తెలస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం నాడే కొత్త బిల్డింగ్ గజద్వారం మీద ఉపరాష్ట్రపతి, రాజ్య సభ ఛైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఇక మంగళవారంనాడు ఎంపీలందరికీ ప్రత్యేక ఫోటో సెషన్ ఏర్పాటు చేశారు. పార్లమెంట్ సభ్యులంతా ఆరోజు ఉదయం 9.30 గంటలకు గ్రూప్ ఫోటో సెషన్ కు అటెండ్ కావాలని లోక్ సభ సెక్రటేరియట్ కోరింది.

ఇక పార్లమెంటులో ప్రధాన ఎన్నికల కమీషనర్, ఇతర ఎన్నికల కమీషనర్ల నియామకాలకు సంబంధించిన బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. దీంతో పాటూ లోక్ సభలో ది అడ్వొకేట్స్ బిల్లు, 2023 దిప్రెస్ అండ్ రిజస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు, ది పోస్టాఫీస్ బిల్లు ఉన్నాయి. వన్ డే వన్ ఎలక్షన్, మహిళా రిజర్వేషన్, ఉమ్మడి పౌరస్మృతి, దేశం పేరు మార్పు బిల్లుల గురించి కూడా చర్చిస్తారని ప్రచారం జరుగుతున్నా....కేంద్రం మాత్రం ఏమీ కన్ఫార్మ్ చేయలేదు.

మరోవైపు చైనా దురాక్రమణ, కుప్పకూలుతున్న ఆర్ధిక వ్యవస్థ, పెరుగుతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, అదానీ కంపెనీకి అక్రమాలు లాంటి కీలక అంవాల మీద సమావేశాల్లో చర్చించాలని కాంగ్రెస్ పట్టు బడుతోంది. దీనికి సంబంధించి సోనియాగాంధీ ఇది వరకే ప్రధాని మోదీకి లేఖ రాశారు.

ఈ ప్రత్యేక పార్లమెంటు సమావేశాల మీద కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. సీడబ్ల్యూసీ మీటింగ్ కు హాజరైన కర్ణాటక ఉపముఖ్యమంత్రి పార్లమెంట్ ప్రత్యేక సెషన్స్ గురించి స్పందించారు. ఎలాంటి ఎజెండా లేకుండా పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడం దేశ చిరిత్రలో ఇదే మొదటిసారి అని డీకె మండిపడ్డారు. దీన్ని బట్టి దేశంలో చట్టాల పరిస్థితి ఏమిటనేది అర్ధం చేసుకోవచ్చని అన్నారు.

Advertisment
తాజా కథనాలు