Parliament Sessions : రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం

రేపటి నుండి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జులై 3 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. తొలిరోజు 280 మంది లోక్ సభ ఎంపీలతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు ప్రొటెం స్పీకర్ మోహతాజ్. రెండవ రోజు మిగిలిన 264 మంది ఎంపీలు ప్రమాణస్వీకారం చేస్తారు.

New Update
Parliament Sessions : రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం

Lok Sabha : రేపటి నుండి పార్లమెంట్ సమావేశాలు (Parliament Sessions) ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు ఈ సమావేశాలు ప్రారంభం అవుతాయి. తొలిరోజు 280 మంది లోక్ సభ ఎంపీలతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు ప్రొటెం స్పీకర్ మోహతాజ్. రెండవ రోజు మిగిలిన 264 మంది ఎంపీలు ప్రమాణస్వీకారం చేస్తారు. రేపు తొలుత ప్రధాని మోదీ (PM Modi) ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆ తరువాత సీనియారిటీ ప్రకారంగా కేంద్ర మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారు. మొదటి రోజు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కు సంబంధించిన ఎంపీలు ప్రమాణస్వీకారం చేయగా..రెండో రోజు తెలంగాణ (Telangana) కు సంబంధించిన ఎంపీలు ప్రమాణస్వీకారం చేయనున్నారు. అనంతరం కొత్త లోక్ సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల ఎన్నిక ఉంటుంది. జులై 3 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి.

Also Read : హైదరాబాద్‌ గాంధీ భవన్‌లో ఉద్రిక్తత

Advertisment
Advertisment
తాజా కథనాలు