Parliament Attack : పార్లమెంటు దాడి ప్రధాన సూత్రధారుడు లలిత్ ఝా ఎవరు? అతనికి బెంగాల్ లో ఎన్జీవోకి ఉన్న సంబంధం ఏంటి? పార్లమెంటు దాడికి ప్రధాన సూత్రధారుడు అయిన లలిత్ ఝా గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఇతను దాడి తర్వాత నీలాక్ష్ అనే వ్యక్తితో మాట్లాడినట్టు తెలుస్తోంది. దాడి వీడియో కూడా అతనికి వాట్సాప్ లో పంపాడని పోలీసులు చెబుతున్నారు. By Manogna alamuru 14 Dec 2023 in క్రైం Uncategorized New Update షేర్ చేయండి Lalit Joo : పార్లమెంటులో గ్యాస్ నిందితుల్లో ప్రధానమైన లలిత్ ఝా(Lalit Joo) ప్రస్తుతం పరారీలో ఉన్నారు.ఇతను ముందు ఢిల్లీ(Delhi) లో సంఘటన తర్వాత రాజస్థాన్ నీమ్రానా గ్రామానికి పారిపోయాడు. అక్కడ అతని లైవ్ లొకేషన్ ను పోలీసులు కనుగొన్నారు. కానీ తీరా పోలీసులు అక్కడికి వెళ్ళేసరికి నీమ్రానా నుంచి కూడా లలిత్ పరారయ్యాడు. అయితే ఇతను పారిపోవడానికి ముందు పార్లమెంటులో సంఘటన తర్వాత ఒక వ్యక్తితో మాట్లాడారు. పార్లమెంటు అటాక్ వీడియో కూడా పంపించారు. లలిత్ మాట్లాడిన, వీడీయో పంపిన వ్యక్తి పేరు నీలాక్ష్ ఐచ్. ఇతను పశ్చిమ బెంగాల్ కు చెదిన వ్యక్తి. నీలాక్ష్ అక్కడ ఒక ఎన్జీవోతో భాగస్వామ్యం కలిగి ఉన్నాడు. ఈతనితో ఇండియాటుడే మాట్లాడ్డానికి ప్రయత్నించినప్పుడు లలిత్ ఝా గురించి చాలా విషయాలు తెలిసాయి. Also Read:అలా ఎలా అంటారు మేడం.. పీరియడ్ లీవ్ పై సెన్సేషనల్ అవుతున్న స్మృతి వ్యాఖ్యలు నీలాక్ష్ సని చేస్తున్న ఎన్జీవోలో లలిత్ కూడా కూడా పనిచేసేవాడు అని తెలుస్తోంది. లలిత్ దీనికి ప్రధాన కార్యదర్శి కూడా. కోలకత్తాలో జరిగిన ఓ కార్యక్రమంలో నీలాక్ష్, లలిత్ ఇద్దరూ కలిశారు. చిన్న చిన్న గ్రామాల్లో పని చేయడానికి ఓ వ్యక్తి కావాలని చూస్తున్నప్పుడు లలిత్ కలిశారు. మేము చాలా చోట్లకు తిరిగి పనిచేయలేకపోయాము. అలాంటి టైమ్ లో లలిత్ మాకోసం పని చేస్తానని చెప్పారు. అందుకే అతనిని మా ఎన్జీవోలో జాయిన్ చేసుకున్నాం అంటూ చెప్పుకొచ్చారు నీలాక్ష్. ఇండియా టుడే(India Today) కథనం ప్రకారం పార్లమెంటులో దాడి తర్వాత లలిత్...నీలాక్ష్ తో మాట్లాడారు, దాడి వీడియో కూడా పంపించారు. అయితే నీలాక్ష్ మాత్రం లలిత్ తనకు ఫోన్ చేయలేదు కానీ వీడియోను మాత్రం పంపించారు అని చెప్పారు. పార్లమెంటుకు వెళ్ళే దారిలో నిరసనకారులు పొగతో చిత్రహింసలు పెట్టిన వీడియో పంపాడు. దాడి తరువాత ఆ వీడియోను కూడా వాట్సాప్ లో పెట్టాడు. నేను వెంటనే చూడలేకపోయాను. నా క్లాసు అయిన తర్వాత చూశాను. అప్పుడు రిప్లై పెట్టాను అని చెబుతున్నారు నీలాక్ష్. దాడి ఎందుకు చేశావు అని కూడా అడిగానని చెబుతున్నారు. అసలు ఈ దాడి గురించి కూడా మాతో ఎప్పుడూ నేరుగా చెప్పలేదు. ఒక్కటే విషయం మాకు చెప్పాడు...అదేంటంటే మేము డిసెంబర్ లో ఏ సమావేశాన్ని ప్లాన్ చేసినా 12వ తేదీ లోపు చేయమని మాత్రమే చెప్పారని నీలాక్ష్ తెలిపారు. అంతేకాదు లలిత్ ఝా ఎప్పుడూ తన గురించి మాతో చెప్పలేదు. అతను ఎక్కడ నుంచి వచ్చాడు, చిరునామా ఏంటి ఈ వివరాలేవీ మాకు తెలియదు అని చెబుతున్నారు నీలాక్ష్. కేవలం అతను కొలకత్తా నుంచి వచ్చానని మాత్రమే చెబుతూ ఉండేవాడు. అందుకే మా ఎన్జీవో సభ్యత్వ కార్డును కూడా అతనికి ఇవ్వలేకపోయాము. పైతా అతని దగ్గర రెండు వాట్సాప్ నంబర్లు ఉన్నాయి. ఒక్కోసారి ఒక్కోటి ఉపయోగించేవాడు. ఇప్పుడు అతనితో కలిసి పార్లమెంటులో దాడి చేసిన వారి గురించి కూడా తనకు ఏమీ తెలియదంటున్నారు నీలాక్ష్. లలిత్ ను కూడా తాను చివరిసారి జూలైలో ఎల్గిన్ లో మా ఎన్జీవో కార్యక్రమం జరిగినప్పుడు కలిశాను. అతని వయసు, చదువుకుంటున్నాడా? జాబ్ చేస్తున్నాడా లాంటి విషయాలు కూడా తనకి తెలియవని చెప్పారు. #parliament #attack #parliament-attack #lalit-joo మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి