AP : పిచ్చి కూతలతో ఆయన చరిష్మను ఇంచు కూడా కదపలేరు.. పరిటాల సునీత

దివంగత నేత పరిటాల రవి 19వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. అభిమానులు, టీడీపీ కార్యకర్తల నడుమ పరిటాల సునీత, శ్రీరామ్ తో కుటుంబ సభ్యులు ఘాట్ వద్ద రవికి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సునీత పిచ్చి కూతలతో రవి చరిష్మను ఇంచు కూడా కదపలేరన్నారు.

AP : పిచ్చి కూతలతో ఆయన చరిష్మను ఇంచు కూడా కదపలేరు.. పరిటాల సునీత
New Update

Anantapur: మాజీ మంత్రి, దివంగత నేత పరిటాల రవీంద్ర (Paritala Ravindra)ఒక గొప్ప వ్యక్తి మాత్రమే కాదు.. ఆయనొక శక్తి అని మాజీ మంత్రి పరిటాల సునీత (Sunitha) అన్నారు. రామగిరి మండలం వెంకటాపురంలో పరిటాల రవి 19వ వర్ధంతిని ఈసారి కూడా ఘనంగా నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, టీడీపీ (TDP) కార్యకర్తల నడుమ పరిటాల సునీత, శ్రీరామ్ (SRIRAM) తో పాటు వారి కుటుంబ సభ్యులు ఘాట్ వద్ద రవికి ఘనంగా నివాళులర్పించారు. కాసేపు అక్కడే కూర్చుని.. రవితో గడిపిన క్షణాల గురించి స్మరించుకుని ఉద్వేగానికి లోనయ్యారు. అనంతరం జిల్లాతో పాటు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు ఘట్ వద్ద నివాళుర్పించారు. అలాగే వేలాది మందికి అన్నదాన కార్యక్రమాన్ని సునీత, శ్రీరామ్ ఇతర కుటుంబసభ్యులు ప్రారంభించారు.

చరిత్రలో నిలిచివుంటారు..
ఈ సందర్భంగా పరిటాల సునీత మాట్లాడుతూ.. ఆయన చనిపోయి 19ఏళ్లు అయిందంటే నమ్మలేకపోతున్నానన్నారు. ఆయన చేసిన కార్యక్రమాలతో ప్రజల గుండెల్లో నిలిచిపోతారని, ఎంతో మంది పుడుతారు.. చనిపోతారు కానీ.. చరిత్ర కొంత మందిని మాత్రమే గుర్తు పెట్టుకుంటుందన్నారు. అందులో ఎన్టీఆర్, పరిటాల రవి పేర్లు భూమి ఉన్నంత వరకు నిలిచి ఉంటాయన్నారు. ఆయన ఆశయాల్ని పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ద్వారా కొనసాగిస్తున్నామన్నారు సునీత తెలిపారు. మరోవైపు కొంతమంది ఆయన గురించి ఘెరంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు వారికి పరిటాల రవి గురించి ఏం తెలుసు? అని ఆమె ప్రశ్నించారు. ఇలాంటి పిచ్చి కూతలతో ఆయన చరిష్మను ఇంచు కూడా కదపలేరంటూ సునీత ఆసక్తికరంగా మాట్లాడారు.

ఇది కూడా చదవండి : AP: ఏపీలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయి.. వైఎస్ షర్మిలా సంచలన వ్యాఖ్యలు

ప్రజల గుండెల్లో ఉన్నారు..
ఇక పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ.. పరిటాల రవి స్ఫూర్తి, ఆత్మనే మమ్మల్ని నడిపిస్తోందన్నారు. ఎన్ని రోజులు బతికామన్నది కాదు.. ఎలా బతికామన్నది ముఖ్యమన్నారు. సమాజం కోసం, సమాజహితం కోసం పరిటాల రవి బతికారు కాబట్టే.. ఇన్ని రోజులు ఆయన ప్రజల గుండెల్లో ఉన్నారన్నారు. అలాంటి వ్యక్తి కొడుకుగా పుట్టినందుకు గర్వంగా ఉందని, ఆయన తలుచుకుని ఏ కార్యక్రమం చేపట్టినా సక్సెస్ అవుతుందన్నారు. వర్ధంతి సందర్భంగా చాలా చోట్ల రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారన్న శ్రీరామ్.. వారిచ్చే ప్రతి రక్తపు బొట్టు రవిపై ఉన్న అభిమానాన్ని చాటుతోందన్నారు. అంతే కాకుండా చాలా మంది ప్రాణాలు నిలబెడుతోందని తెలిపారు.

#sunitha #sriram #paritala-ravi #19th-death-anniversary
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe