Olympics Winners : ఒలింపిక్స్ విజేతలకు డబ్బులే డబ్బులు..

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాలు తెచ్చిన క్రీడాకారులకు కాసుల వర్షం కురుస్తోంది. పతకాలు తెచ్చిన వారికి కేంద్ర ప్రభుత్వంతో పాటూ సొంత రాష్ట్రాల ప్రభుత్వాలు నగదు బహుమతులు ప్రకటిస్తున్నాయి.

Olympics Winners : ఒలింపిక్స్ విజేతలకు డబ్బులే డబ్బులు..
New Update

Paris Olympics Winners : పారిస్ ఒలింపిక్స్‌ (Paris Olympics 2024) లో భారత అథ్లెట్లు ఈసారి డబుల్ డిజిట్‌లో పతకాలు తెస్తారని భావించారు. కానీ గ్యారంటీగా వస్తాయనుకున్నవి కూడా రాలేదు. అయితే అస్సలు ఊహించని వాటిల్లో పతకాలు తెచ్చుకుని ఆశ్చర్య పరిచారు భారత అథ్లెట్లు. ఏ మాత్రం అంచనాలు లేని వారు పతకాలు సాధించుకుని వచ్చారు. మొత్తంగా ఆరు మెడల్స్‌తో మెరిశారు. ఇందులో ఐదు కాంస్యాలు, ఒక రజత పతకాలున్నాయి. వీరికి ఆయా ప్రభుత్వాలు నగదు బహుమతులను ప్రకటించాయి.

స్టార్ షూటర్ మను బాకర్ (Manu Bhaker).. ఈమెకు రెండు పతకాలు వచ్చాయి. మొత్తంగా ఆరు మెడల్స్‌తో మెరిశారు. ఇందులో ఐదు కాంస్యాలు, ఒక రజత పతకాలున్నాయి. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన అథ్లెట్‌గా కూడా మను ఘనత వహించింది. అందుకే కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ రూ.30 లక్షల రివార్డును మనుబాకర్‌కు ప్రకటించారు.

మనుతో కలిసి మిక్స్‌డ్ ఈవెంట్లో సరబ్‌జ్యోత్ సింగ్ కాంస్య పతకాన్ని అందుకున్నాడు. దీనికి గానూ ఇతను కేంద్ర క్రీడల శాఖ మంత్రి నుంచి 22.5 లక్షల రివార్డును అదుకోనున్నారు. దాంతో పాటూ హరియాణా ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామని ప్రకటించింది. కానీ సరబ్ జ్యోత్ సింగ్ దానిని తిరస్కరించారు. తాను ఇంకా ఆడాలనుకుంటున్నాని చెప్పారు.

ఇక పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్‌ విభాగంలో కాంస్య పతకం సాధించిన స్వప్నిల్ కుశాలె (Swapnil Kusale) కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే రూ. కోటి బహుమతి ప్రకటించారు. అదికాక ఇప్పటికే రైల్వేలో పనిచేస్తున్న ఇతనిని సెంట్రల్‌ రైల్వేలో ప్రత్యేక అధికారిగా నియమించారు.

పురుషుల హాకీ జట్టు..
పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు అదరగొట్టింది.ఫైనల్స్‌కు వెళతారని అనుకున్నా తృటిలో తప్పిపోయింది. కానీ కాంస్యంతో మెరిశారు . దీంతో వరుసగా రెండోసారి కాంస్య పతకాన్ని సాధించి సత్తా చాటారు. అందుకే జట్టులోని ఒక్కో సభ్యుడికి రూ.15 లక్షలు, సహాయక సిబ్బందికి ఒక్కొక్కరికి రూ.7.5 లక్షల నగదు బహుమతిని ప్రకటించింది హాకీ ఇండియా. దాంతో పాటూ డిఫెండర్‌ అమిత్‌ రోహిదాస్‌కు ఒడిశా ప్రభుత్వం రూ. 4 కోట్ల నజరానా ఇవ్వనుంది. ఒక్కో సభ్యుడికి రూ. 15 లక్షలు, సపోర్ట్‌ స్టాఫ్‌కు రూ. 10 లక్షల రివార్డు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇక హాకీ జట్టుకు పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్ మన్‌ కూడా రూ. కోటి నగదు బహుమతి ప్రకటించారు.

ఒలింపిక్స్‌లో ఏకైక రజత పతకధారుడు జావెలిన్‌ త్రో ప్లేయర్ నీరజ్‌ చోప్రా (Neeraj Chopra). ఇతని బహుమతుల గురించి ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటనా లేదు. కానీ భారీ ఆఫర్లే లైన్లో ఉన్నాయని తెలుస్తోంది. ఇక చివరగా ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌లో పతకం గెలిచిన ఒకే ఒక్క ప్లేయర్ అమన్ సెహ్రావత్. ఇతని గురించి కూడా వివరాలు తెలియలేదు.

Also Read:  Hyderabad: ఆగస్టు 16న హైదరాబాద్‌లో ఎడ్యుకేషన్ ఫెయిర్‌

#paris-olympics-2024 #central-government #india #state-government
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe