Jammu-kashmir: జమ్మూ–కాశ్మీర్‌‌లో మళ్ళీ టెర్రర్ అటాక్..పారామిలటరీ ఆఫీసర్ మృతి

జమ్మూ–కాశ్మీర్‌‌లో ఉగ్రవాదులు మళ్ళీ తెగబడ్డారు. ఉదంపూర్‌‌లోని దాదూ ప్రాంతంలో పెట్రోలింగ్‌ జవాన్ల మీద కాల్పులు జరిపారు. ఇందులో సెంట్రల్ రిజర్వ్‌ పోలీస్ ఫోర్స్‌కు చెందిన ఒక అధికారి మృతి చెందారు. ఒక పౌరుడు గాయపడ్డారు.

New Update
Jammu-kashmir: జమ్మూ–కాశ్మీర్‌‌లో మళ్ళీ టెర్రర్ అటాక్..పారామిలటరీ ఆఫీసర్ మృతి

Terrorist Attack: జమ్మూ–కాశ్మీర్‌‌లో టెర్రరిస్టులు కొన్ని రోజులుగా రెచ్చిపోతూనే ఉన్నారు. భారత ఆర్మీ వారిని మట్టుబెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉంది..మరోవైపు ఉగ్రవాదులు దాడుల చేస్తూనే ఉన్నారు. ఈరోజు మళ్ళీ టెర్రరిస్టులు భారత ఆర్మీ మీద అటాక్ చేశారు. పెట్రోలింగ్‌లో ఉన్న జవాన్ల మీద కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పారామిలటరీకి చెందిన ఒక అధికారి మృతి చెందారు. ఈయనతో పాటూ ఒక పౌరుడు కూడా గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో భారత ఆర్మీ ఉగ్రవాదుల మీద ఎదురు దాడి చేసింది. సీఆర్‌‌పిఎఫ్‌, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్‌ రెండూ కలిపి కాల్పులు జరిపాయి.

అయితే ఈసారి ఉగ్రవాదులుజమ్మూ– కాశ్మీర్‌‌లో ప్రశాంతంగా ఉండే ప్రాంతంలో దాడులకు తెగబడ్డారు. ఎప్పుడూ కాశ్మీర్‌‌లో దాడులు జరుగుతుంటాయి. కానీ జమ్మూ కొన్నేళ్ళుగా ప్రశాంతంగానే ఉంది. అందులోనూ ప్రత్యేకించి పీర్ పంజాల్‌లో దాడులు కొన్నేళ్ళుగా దాదాపుగా ఆగిపోయాయి. కానీ ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఉగ్రవాద కార్యకలాపాలు ఊపందుకున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ దట్టమైన అడవులు, ఏటవాలు పర్వతాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఆసరా చేసుకునే టెర్రరిస్టులు దాడులు చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్‌లోని ప్రధాన రహదారులను ఉగ్రవాదులు టార్గెట్ చేసి ఉండవచ్చునని ఇటీవలి ఇంటెలిజెన్స్ నివేదికలు సూచించాయి. దానికితోడు ఇప్పుడు అటాక్ జరగడంతో హైవేలు, పరిసర ప్రాంతాల్లో గస్తీకి స్థానిక పోలీసులతో పాటు సీఆర్‌పీఎఫ్‌ నుంచి మరిన్ని బలగాలను మోహరించాలని కేంద్రం నిర్ణయించింది.

Also Read: Kolkata: ట్రైనీ డాక్టర్ హత్య కేసులో నిందితుడికి లై డిటెక్టర్ టెస్ట్

Advertisment
Advertisment
తాజా కథనాలు