Prabhas FB Hacked: ప్రభాస్ ఫేస్ బుక్ ఖాతా హ్యాక్.. క్లారిటీ ఇచ్చిన డార్లింగ్

ప్రభాస్ ఆదిపురుష్, సలార్, రాజా డీలక్స్ వంటి సినిమాలతో పాటు ప్యాన్ వరల్డ్ లెవల్‌లో ప్రాజెక్ట్ కే అనే సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోన్న ఈసినిమాకు మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. అది అలా ఉంటే ప్రభాస్ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయ్యినట్లు తెలుస్తోంది.

Prabhas FB Hacked: ప్రభాస్ ఫేస్ బుక్ ఖాతా హ్యాక్.. క్లారిటీ ఇచ్చిన డార్లింగ్
New Update

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ కు గురైంది. ఈ విషయాన్ని డార్లింగ్ స్వయంగా ఇన్ స్టా స్టోరో ద్వారా తెలియజేశాడు. గురువారం సాయంత్రం ప్రభాస్ ఫేస్ బుక్ అకౌంట్ లో ఓ వీడియో వైరల్ అయింది. ఆ వీడియోకి 'మనుషులు దురదృష్టవంతులు' అని క్యాప్షన్ ఉంది. ఈ వీడియో చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే డార్లింగ్ ఎఫ్ బీ ఖాతా హ్యాక్ అయ్యిందంటూ ట్వీట్స్ పెట్టారు. దీనిపై వెంటనే అప్రమత్తమైన డార్లింగ్ టీమ్ ఆ సమస్యను పరిష్కరించింది. కొద్దిసేపటికే ఖాతాను పునరుద్ధరించింది.

అందులో షేర్ చేసిన వీడియోను తొలగించింది. మరోవైపు తన అకౌంట్ హ్యాక్ అయినట్లు ప్రభాస్ స్వయంగా తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా తెలియజేశారు. తన ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ అయ్యిందని.. అతి త్వరలో దాన్ని రిస్టోర్ చేసేందుకు టీమ్ ప్రయత్నిస్తోందని తెలిపారు.

కాగా ప్రభాస్ 2013 అక్టోబర్ 18న ఫేస్ బుక్ లోకి అడుగుపెట్టారు. అంటే ఇప్పటికి 11 ఏళ్లు అవుతోంది. డార్లింగ్ కు 24 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. కానీ ప్రభాస్ మాత్రం టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళిని మాత్రమే ఫాలో అవుతున్నాడు. కేవలం తన సినిమా విషయాలు.. నటీనటులకు విషెస్ చెప్పడానికి మాత్రమే సోషల్ మీడియాలో ఆ ఖాతాను ఉపయోగిస్తూంటారు.

మరోవైపు ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఆయన నటించిన 'ఆదిపురుష్' చిత్రం తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. కానీ ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక ఇప్పుడు డార్లింగ్ ఫ్యాన్స్ ఆశలన్ని 'సలార్', 'ప్రాజెక్ట్ K' చిత్రాలపైనే ఉన్నాయి. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న సలార్ చిత్రం సెప్టెంబర్ 28న అడియన్స్ ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా భారీ అంచనాలు నెలకొన్నాయి.

అలాగే డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె సినిమా చేస్తున్నారు. అమిబాత్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలకపాత్రలు పోషిస్తున్న ఈ మూవీ టైటిల్ కల్కి 2898AD అని ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ మూవీ ఏ రెంజ్ లో ఉంటుందో చెప్పేసింది. ఇవే కాకుండా మారుతి సినిమా పట్టాలపై ఉండగా, త్వరలోనే సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్' సినిమా పట్టాలెక్కనుంది.

#viral #tollywood #prabhas #facebook #pan-india-star-prabhas #tollywood-news #pprabhas-facebook-account-hacked #facebook-account
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe