Big Breaking: బీఆర్ఎస్ పార్టీలో చేరిన పాల్వాయి స్రవంతి..

కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన పాల్వయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి గులాబీ గూటికి చేరారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆమె బీఆర్ఎస్‌లో చేరారు. చాలా ఆలోచించిన తర్వాతే బీఆర్ఎస్‌లో చేరానని.. గౌరవం లేని చోట ఉండాల్సిన అవసరం లేదని స్రవంతి అన్నారు.

New Update
Big Breaking: బీఆర్ఎస్ పార్టీలో చేరిన పాల్వాయి స్రవంతి..

కాంగ్రెస్ నేత, దివంగత రాజ్యసభ సభ్యుడు పాల్వయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.  అయితే ఈరోజు ఆమె గులాబి గూటికి చేరారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో స్రవంతి బీఆర్ఎస్‌లో చేరారు. కేటీఆర్ ఆమెకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ మారడంపై స్పందించిన స్రవంతి.. చాలా ఆలోచించన తర్వాతే బీఆర్ఎస్‌లో చేరానని.. గౌరవం లేని చోట ఉండాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. పార్టీలో ముందు నుంచి ఉంటున్న నేతలను పక్కనపెట్టి.. ఇతరులకు అవకాశాలు కల్పిస్తున్నారని అన్నారు. అయితే తాను పదవుల కోసం బీఆర్‌ఎస్‌లో చేరడం లేదని తెలిపారు. బీఆర్ఎస్‌తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.

అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. స్రవంతి తమ పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. ఆమెను కాంగ్రెస్ పార్టీ అవమానించిందని..గౌరవం లేని చోట ఉండలేకే ఆమె తమ పార్టీలోకి వచ్చారని అన్నారు. మునుగోడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎవరూ దిక్కు లేనప్పుడు స్రవంతిని అభ్యర్థిగా నిలబెట్టారని.. ఆమె పోటీ చేసినందుకే ఆమాత్రం ఓట్లు వచ్చాయని తెలిపారు. ఇక మాజీ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎందుకు పార్టీలు మారుతున్నారో ఆయనకే తెలిదంటూ ఎద్దేవా చేశారు. గతంలో రాజగోపాల్ రెడ్డి , పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలు దూషించుకొని మళ్లీ ఇప్పుడు ఒక్కటైపోయారంటూ విమర్శించారు. తెలంగాణ ఉద్యమానికి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి సహకరించారన్న కేటీఆర్.. ఆయన సేవల్ని కొనియాడారు. అలాగే స్రవంతికి కీలక పదవి అప్పగిస్తామని హామీ ఇచ్చారు.

Also Read: ఎమ్మెల్యేపై దాడి.. ఆ నియోజకవర్గంలో హైటెన్షన్..

మరోవైపు రాష్ట్ర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ కొత్త కుట్రలకు తెరలేపాయంటూ ఆరోపించారు. దేశంలో కేటీఆర్ చక్రం తిప్పకుండా ఈ రెండు పార్టీలు కుట్రలు చేస్తున్నాయంటూ విమర్శించారు. 15 రోజుల పాటు ఇవే కుట్రలు చేస్తూ ప్రజల ఆలోచనలు మారేలా చేస్తారని.. సోషల్ మీడియాలో ఢిల్లీ పెద్దలు వదంతులు సృష్టిస్తారని అన్నారు. రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్‌ సర్కారేనని ధీమా వ్యక్తం చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు