Isreal attacks:గాజాలో శరణార్ధుల శిబిరాల మీద ఇజ్రాయెల్ దాడి..73మంది మృతి

గాజాలో ఇజ్రాయెల్ దాడులు విపరీతం అవుతున్నాయి. ఎవ్వరినీ క్షమించకుండా అటాక్ చేస్తోంది. వాళ్ళ లక్ష్యం హమాసే అయినప్పటికీ సాధారణ పాలస్తీనాయన్లు బలైపోతున్నారు.

Isreal attacks:గాజాలో శరణార్ధుల శిబిరాల మీద ఇజ్రాయెల్ దాడి..73మంది మృతి
New Update

గాజాలోని శరణార్ధుల శిబిరాలు బాంబులతో దద్ధరిల్లుతున్నాయి. టార్గెట్ హమాస్ వల్ల గాజాలోని అమాయక పాలస్తీనియన్లు మృతి చెందుతున్నారు. రాత్రుళ్ళు కూడా అక్కడ ప్రజలు ప్రశాంతంగా ఉండడం లేదు. శనివారం అర్ధరాత్రి మూడు శరణార్ధి శిబిరాలపై బాంబు దాడులు జరిగాయి. అందులో అల్ మఘాజీ రెఫ్యూజీ క్యాంపు మీద జరిగిన దాడిలో ఏకంగా 47 మంది మరణించారు.34 మంది గాయపడ్డారు. జబాలియా క్యాంపులో ఆరుగురు మృతి చెందారు. ఇక నిన్న జరిగిన దాడుల్లో బురీజ్ క్యాంపులోని పాలస్తీనియన్లు ఇళ్ళమీద దాడి చేశారు. ఇందులో 20 మంది చనిపోయారు. మొత్తానికి 24 గంటల్లో 73 మంది పాలస్తీయనియన్లు మరణించారు. 60 మందికి పైగా గాయపడ్డారు.

ప్రస్తుతం గాజాలో ప్రజల మరణాలు వారి దుస్థితి ఆందోళనకరంగా మారింది. ఇలా సామాన్య ప్రజలు చనిపోవడాన్ని ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. ఇజ్రాయెల్ దాడులు ఆపాలని అరబ్ దేశాలు చెబుతున్నాయి. ఐక్య రాజ్య సమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ విషయాలను ఎప్పటి నుంచో చెబుతోంది. గాజాలో మానవమనుగడకే ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నాయి.

అయితే ఇజ్రాయెల్ మాత్రం వేరేగా వాదిస్తోంది. హమాస్ మిలిటెంట్లు సామాన్య ప్రజల ముసుగులో ఆసుపత్రులు, పాఠశాలల దగ్గరలో ఉంటున్నారని చెబుతోంది. అందుకే గాజా మొత్తం మీద దాడులు చేస్తున్నామని అంటోంది. మరోవైపు హమాస్ మిలిటెంట్లను అంతం చేయడానికి గాజాపై అణుబాంబు ప్రయోగించే అవకాశం ఉందని వివాస్పద వాఖ్యలు చేసిన ఇజ్రాయెల్ మంత్రిని ఆదేశ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇతనే గాజాలో సామాస్య ప్రజలు ఎవరూ లేరని...అందరూ హమాస్ మిలిటెంట్లే అని అని కూడా అన్నారు.

గాజాలో దాడుల్లో ఇప్పటివరకు 9,700 మందికి పైగా మరణించారు. వీరిలో 4, 800 మందికి పైగా చిన్నారులున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ 29 మంది తమ సైనికులను ఈ యుద్ధంలో కోల్పోయింది.

#palestinians #gaza #hamas #israel
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe