Palestine: పాలస్తీనా ప్రధాని రాజీనామా.. కారణం ఇదే..

పాలస్తీనా ప్రధాని మొహమ్మద్ శతాయే తన పదవికి రాజీనామా చేశారు. గాజాతో పాటు వెస్ట్‌ బ్యాంకులో హింసాత్మక ఘటనలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు పాలస్తీనా అధ్యక్షుడు మొహమ్మద్ అబ్బాస్‌కు రాజీనామా లేఖను సమర్పించారు.

Palestine: పాలస్తీనా ప్రధాని రాజీనామా.. కారణం ఇదే..
New Update

Palestine: పాలస్తీనా ప్రధాని మొహమ్మద్ శతాయే తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం గాజాతో పాటు వెస్ట్‌ బ్యాంకులో హమాస్, ఇజ్రాయెల్ మధ్య హింసాత్మక ఘటనలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు పాలస్తీనా అధ్యక్షుడు మొహమ్మద్ అబ్బాస్‌కు రాజీనామా లేఖను సమర్పించారు. 'గాజా స్ట్రిప్‌పై దురాక్రమణకు సంబంధించి తలెత్తిన పరిణామాలు, వెస్ట్‌ బ్యాంక్‌, జెరుసలెంలో హింసాత్మక ఘటనలు తీవ్రతరమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నానని.. రాజీనామా లేఖను అధ్యక్షుడికి అందజేశానని' మొమహ్మద్‌ శతాయే తెలిపారు.

Also Read: అగ్రరాజ్యంలో తెలంగాణ యువకుడు మృతి!

అలాగే హమాస్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌ చేస్తున్న యుద్ధం ముగిసిన తర్వాత ఇక్కడ రాజకీయ ఏర్పాట్లకు సంబంధించి పాలస్తీనా ప్రజల్లో ఒక ఏకాభిప్రాయం ఏర్పడేందుకు వీలుగా తాను రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. అయితే రాజీనామా ఆమోదానికి సంబంధించి పాలస్తీనా అధ్యక్షుడి నుంచి ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే పాలస్తీనా ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్ ఛైర్మన్‌గా ఉన్న మొహమ్మద్‌ ముస్తఫాను కొత్త ప్రధానిగా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

యుద్ధం ముగిసిన అనంతరం గాజా ప్రాంతాన్ని పాలించే రాజకీయ వ్యవస్థ నిర్మాణంపై ఇప్పటికే ప్రయత్నాలు మొదలైనట్లు సమాచారం. ఇందుకోసం పాలస్తీనా అధికార యంత్రాంగాన్ని పునర్‌వ్యస్థీకరించాలని అగ్రరాజ్యం అమెరికా భావిస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ వ్యవహారంపైనే అమెరికా నుంచి పాలస్తీనా అధ్యక్షుడు మొహమ్మద్ అబ్బాస్‌పై తీవ్ర ఒత్తిడి ఉందనే వాదన ఉంది. అయితే పాలస్తీనా అథారిటీలో సంస్కరణలు చేపట్టాలంటే చాలా అడ్డంకులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రధాని మొమమ్మద్ శతాయే రాజీనామా చేయడం చర్చనీయాంశమవుతోంది.

Also Read: నావల్నిని ఆ పద్దతి ద్వారా హత్య చేసి ఉండొచ్చు: ఒసెచ్కిన్‌

#telugu-news #international-news #palestine #israel-palestine-conflict
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe