10 సెకన్లలో 100 బిల్డింగ్లు.. 🔴LIVE : Israel-Iran War | Hezbollah A*ttack LIVE | RTV
Palestine: పాలస్తీనా ప్రధాని రాజీనామా.. కారణం ఇదే..
పాలస్తీనా ప్రధాని మొహమ్మద్ శతాయే తన పదవికి రాజీనామా చేశారు. గాజాతో పాటు వెస్ట్ బ్యాంకులో హింసాత్మక ఘటనలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు పాలస్తీనా అధ్యక్షుడు మొహమ్మద్ అబ్బాస్‌కు రాజీనామా లేఖను సమర్పించారు.
Israel-Palestine: ఆగని ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం.. భారత్ వైఖరికి ఆ పార్టీ అసంతృప్తి..
ప్రధాని మోదీ బాధితులకు సానుభూతి తెలిపిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సోషల్ మీడియాలో స్పందించారు. ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య నెలకొన్న సంక్షోభంపై భారత వ్యవహరిస్తున్న తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పాలస్తీనా వాదాన్ని బలపరచడంతో సహా.. తమ హక్కుల కోసం వారు చేస్తున్నటువంటి పోరాటానికి భారత్‌గా మద్దతుగా నిలిచేదని వ్యాఖ్యానించారు.
Israel Hamas war: మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని ఫోన్ కాల్.. ఏం మాట్లాడుకున్నారంటే?
మోదీతో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్లో మాట్లాడారు. ఈ విషయాన్ని పీఎం మోదీ స్వయంగా ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్‌కు సంఘీభావం తెలిపారు. కొనసాగుతున్న పరిస్థితిపై అప్డేట్ అందించిన నెతన్యాహుకు థ్యాంక్స్ చెప్పారు. ఈ క్లిష్ట సమయంలో భారత ప్రజలు ఇజ్రాయెల్‌కు అండగా నిలిచారన్నారు మోదీ. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్న భారత్ ఖండిస్తుందని చెప్పారు.
Israel-Hamas War: వాళ్ళు మొదలు పెట్టారు.. మేము ముగిస్తాం..! ఆ ప్రధాని స్ట్రాంగ్ వార్నింగ్..!
యుద్ధాన్ని మేం మొదలు పెట్టలేదు కానీ, ముగించేది మేమే అంటూ ఇజ్రాయెల్ ప్రధాని హమాస్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. యుద్దం మొదలు పెట్టి హమాస్ చారిత్రక తప్పిదం చేసిందని వ్యాఖ్యనించారు. ఇజ్రాయెల్ ప్రతిదాడి శత్రుదేశాలకు దశాబ్దాల పాటు గుర్తుండిపోతుందని హెచ్చరిక చేశారు. హమాస్ మెరుపుదాడితో ఉక్కిరిబిక్కిరి అయిన ఇజ్రాయెల్ ఎదురుదాడికి దిగింది. ఇజ్రాయిల్, పాలస్తీన మధ్య భీకరపోరు జరుగుతోంది. గాజాపై ఇప్పటి వరకు 5 వేల బాంబులు పేల్చారు. నిన్న ఒక్క రోజే 2400 బాంబు దాడులు చేశారు. ఈ యుద్ధంలో దాదాపు1,500 మందికి పైగా ఇజ్రాయిలీలు, పాలస్తీనియన్లు చంపబడ్డారు.