Congress: పాలేరు కాంగ్రెస్‌లో ముసలం

ఖమ్మం కాంగ్రెస్‌లో ముసలం నెలకొంది. ఇంతకాలం సైలెంట్‌గా ఉన్న కాంగ్రెస్‌ నేత రాయల నాగేశ్వర్‌ రావు తుమ్మల నాగేశ్వర్‌ రావు పార్టీలో చేరగానే ఘాటుగా స్పందించారు. తాను గత కొన్ని సంత్సరాలుగా కాంగ్రెస్‌ పార్టీ కోసం పని చేస్తున్నట్లు తెలిపిన ఆయన.. పార్టీ అధిష్ఠానం తనను ఏమాత్రం పట్టించుకోవడం లేవని ఆవేదన వ్యక్తం చేశారు.

New Update
Congress: పాలేరు కాంగ్రెస్‌లో ముసలం

ఖమ్మం కాంగ్రెస్‌లో ముసలం నెలకొంది. ఇంతకాలం సైలెంట్‌గా ఉన్న కాంగ్రెస్‌ నేత రాయల నాగేశ్వర్‌ రావు తుమ్మల నాగేశ్వర్‌ రావు పార్టీలో చేరగానే ఘాటుగా స్పందించారు. తాను గత కొన్ని సంత్సరాలుగా కాంగ్రెస్‌ పార్టీ కోసం పని చేస్తున్నట్లు తెలిపిన ఆయన.. పార్టీ అధిష్ఠానం తనను ఏమాత్రం పట్టించుకోవడం లేవని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఇవాళ పార్టీలోకి వచ్చిన తుమ్మల నాగేశ్వర్‌ రావుకు మర్యాదలు చేస్తున్నారన్నారు. మరోవైపు తుమ్మల నాగేశ్వర్‌ రావును ఉద్దేశిస్తూ విమర్శలు చేసిన ఆయన.. కాంగ్రెస్‌ పార్టీని కాపాడే నేత కావాలో పార్టీని సర్వ నాశనం చేసే నేత కావాలో అధిష్టానం తేల్చుతుందన్నారు. మరోవైపు తన సొంత అనుచరుడ్ని కాపాడుకోలేని వ్యక్తి మనల్ని ఎలా కాపాడుతాడని రాయల నాగేశ్వర్‌ రావు గాటు వ్యాఖ్యలు చేశారు.

గతంలో తుమ్మల నాగేశ్వర్‌ రావు పాలేరు నుంచి గెలిచారని గుర్తు చేసిన ఆయన.. ఎమ్మెల్యేగా విజయం సాధించిన అనంతరం క్యాంపు కార్యాలయంలో ఒక్కరోజు కూడా నిద్ర చేయలేదని విమర్శించారు. గత 40 ఏళ్లుగా ఇక్కడ కాంగ్రెస్‌ జెండాను, కండువాను అనిచివేసిన తుమ్మల నాగేశ్వర్ రావు మనకు అవసరమా అని ఆయన ప్రశ్నించారు. మాజీ మంత్రి గతంలో కాంగ్రెస్‌ నేతలను భయపెట్టి మరీ గులాబీ కండువా కప్పారని గుర్తు చేశారు. ఇలాంటి వ్యక్తి పాలేరుకు అవసరమా అని ఆయన ప్రశ్నించారు. పాలేరులో తుమ్మలకు టికెట్‌ ఇస్తే ఓడిపోతారని నియోజకవర్గ ప్రజలే చెబుతున్నారన్నారు.

మరోవైపు కాంగ్రెస్ నేత రాయల నాగేశ్వర్‌ రావు పాలేరు ఎమ్మెల్యే టికెట్‌ ఆశిస్తున్నారు. ఇటీవల ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కోసం ధరఖాస్తు కూడా చేసుకున్నారు. కానీ ప్రస్తుతం తుమ్మల కాంగ్రెస్‌లో చేరడంతో ఆయనకు పోటీకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాగా వైటీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని చూస్తున్నారు. తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తే తాను అడిగిన చోట తన క్యాడర్‌కు సీట్లు ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా షర్మిల సైతం పాలేరు నుంచి పోటీ చేస్తానని గతంలోనే ప్రకటించారు. దీంతో కాంగ్రెస్‌ నుంచి పాలేరు ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు భరిలోకి దిగుతారనేది ఉత్కంఠగా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు