Pakistan Want 'shehzada' as Next PM of India - Modi: కాంగ్రెస్ పాకిస్తాన్ శిష్యుడు అంటూ కామెంట్ చేశారు ప్రధాని మోదీ. గుజరాత్‌లోని ఆనంద్‌లో జరిగిన బహిరంగ సభలో మరోసారి కాంగ్రెస్ మీద విరుచుకుపడ్డారు. ఇక్కడ కాంగ్రెస్ (Congress) చచ్చిపోతోందని పాకిస్తాన్ ఏడ్చినప్పుడే అర్ధమైంది వారిద్దరి మధ్యా ఎలాంటి సంబంధం ఉందో అంటూ మోదీ తీవ్ర విమర్శలు చేశారు. షెహజాదాను అంటే రాహుల్ గాంధీని (Rahul Gandhi) తదుపరి ప్రధాని చేయాలని పాకిస్తాన్ ఉవ్విళ్ళూరుతోంది. ఇందులో ఆశ్చర్యపడాల్సిన విషయం ఏమీ లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పాకిస్తాన్‌కు శిష్యరికం వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే అంటూ కామెంట్ చేశారు. దీనిబట్టి వారిద్దరి మధ్యా ఉన్న భాగస్వామ్యం మరింత బట్టబయలైందని విమర్శించారు. దేశ శత్రువులు ఎప్పుడూ బలహీనమైన ప్రభుత్వాన్నే కోరుకుంటుందని అన్నారు.
ఓటు జీహాదీ అంటే ఏంటో చెప్పాలి..
ఆనంద్, ఖేడా లోక్‌సభ స్థానాలకు (Lok Sabha Elections 2024) బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా సెంట్రల్ గుజరాత్‌లోని ఆనంద్ పట్టణంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సభలోనే మోదీ కాంగ్రెస్ మీద విమర్శలు చేశారు. దాంతో పాటూ అక్కడి ప్రతిపక్ష నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ మేనకోడలు మరియా ఆలం ఇచ్చిన ఓటు జీహాద్ మీద కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇండియా కూటమి ఓటు జీహాదీ అని పిలుస్తోంది. ఇది ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని మోదీ నఅ్నారు. మదర్సాలో చదువుకున్నవారికి జీహాద్ అంటే ఏమిటో అందరికీ తెలిసినదేనని మండిపడ్డారు. దీనిని ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు ఖండించలేదని దుయ్యబట్టారు.
రాజ్యాంగాన్ని మార్చేది లేదు...
ముస్లింలకు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు,ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడానికి కాంగ్రెస్ దేశ రాజ్యాంగాన్ని మార్చాలని కోరుకుంటోందని ఆయన ఆరోపించారు.మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగాన్ని మార్చేదిలేదని..కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముస్లింలకు బ్యాక్‌డోర్ కోటా ఇవ్వబోమని లిఖితపూర్వకంగా ఇవ్వాలని ఆపార్టీ నేతలకు ప్రధాని సవాలు విసిరారు. ముస్లిమ్ రిజర్వేషన్లు, కాంగ్రెస్ మేనిఫెస్టోను ఈ సారి ఎన్నికల్లో తన ప్రధాన అస్త్రంగా చేసుకున్నారు ప్రధాని మోదీ. ప్రతీ సభలోనూ దీని గురించే ఆయన మాట్లాడుతున్నారు.
Also Read:Karnataka : ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు