China-Pak vs India: చైనా ఆయుధాలతో పాక్‌ ఉగ్రవాదుల బరితెగింపు.. మొత్తం చేస్తుంది డ్రాగనేనా?

జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలు చైనా ఆయుధాలు, బాడీసూట్ కెమెరాలు, కమ్యూనికేషన్ పరికరాలను ఉపయోగించి భారత్‌ సైన్యంపై దాడి చేస్తున్నాయని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఉగ్రవాదులు ఉపయోగించే ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ పరికరాలు కూడా చైనావేనని సమచారం.

China-Pak vs India: చైనా ఆయుధాలతో పాక్‌ ఉగ్రవాదుల బరితెగింపు.. మొత్తం చేస్తుంది డ్రాగనేనా?
New Update

పాకిస్థాన్‌(Pakistan) చేసే ప్రతీపని వెనుక చైనా(China) ఉంటుందన్నది అందరికి తెలిసిన విషయమే! ఉగ్రవాదులను పెంచి పోషించే పాకిస్థాన్‌ లాంటి దేశాలకు అండగా ఉండడం.. తర్వాత ఏం తెలియనట్టు డ్రామాలు ఆడడం డ్రాగన్‌కు అలవాటు. వెనుక నుంచి చేయాల్సింది చేసేసి తనకేం సంబంధం లేదనట్టు అమాయకంగా నటించడం చైనా హాబీ. పాక్‌కు సాయం చేసే దేశాల్లో చైనా ముందు వరుసలో ఉంటుంది. ఇక ఇండియా(India)లోని సరిహద్దు భూభాగాలను తమదేనని చైనా చెప్పుకుంటుంటోంది. అరుణాచల్‌ప్రదేశ్‌ తమదేనంటోంది. దీంతో భారత్‌ దళాలు మూడేళ్లుగా చైనా సరిహద్దుల్లో ఎక్కువగా గస్తీ కాస్తున్నారు. ఇండియన్ ఆర్మీ దృష్టి మరల్చడానికే పాకిస్థాన్‌ను కశ్మీర్‌(Kashmir)లోని పూంచ్‌(Poonch)వైపు ఎగదోస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో చైనా-పాక్‌ లింగ్‌పై మరో ఆసక్తికర విషయం వెలుగుచూసింది.

ఆయుధాలు వారివే:

ఉగ్రవాదులు ఉపయోగిస్తున్న ఆయుధాలు చైనాలోనే తయారవుతున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని స్వయంగా నిఘా వర్గాలే చెబుతున్నాయి. జమ్ముకశ్మీర్‌లో సైన్యంపై ఉగ్రవాదులు దాడులకు చైనా తయారీ ఆయుధాలు, కమ్యూనికేషన్ పరికరాలను ఉపయోగిస్తున్నారని నిఘా వర్గాలు తెలిపాయి. జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలు చైనా ఆయుధాలు, బాడీసూట్ కెమెరాలు, కమ్యూనికేషన్ పరికరాలను ఉపయోగించి సైన్యంపై దాడి చేస్తున్నాయని చెప్పాయి. ఇటీవలి దాడుల్లో ఉగ్రవాద గ్రూపులు ఉపయోగించిన డ్రోన్లు, హ్యాండ్ గ్రెనేడ్లు, ఇతర ఆయుధాలను పాక్ సైన్యానికి చైనా సరఫరా చేస్తోందని, దీనికి సంబంధించిన ఆధారాలు భద్రతా దళాలకు లభించాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.

మెసేజింగ్ పరికరాలు కూడా డ్రాగన్‌వే:

పాకిస్థాన్ నుంచి భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులు చైనా సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన స్నిపర్ గన్‌లను ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నవంబర్‌లో జమ్ముకశ్మీర్‌ సరిహద్దులో భారత సైనికుడిపై స్నైపర్ గన్ ప్రయోగించారు. కమ్యూనికేషన్ కోసం ఉగ్రవాదులు ఉపయోగించే ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ పరికరాలు కూడా చైనావేనని నిఘా వర్గాలు చెబుతున్నాయి. నిజానికి పాక్‌ సైన్యానికి చైనా నుంచి ఆయుధాలు, కెమెరాలు, కమ్యూనికేషన్ పరికరాలు సరఫరా అవుతాయన్న విషయం అందరికి తెలిసిందే. అయితే వాటిని చొరబాట్లు, ఉగ్రవాద దాడుల కోసం పీఓకేలోని ఉగ్రవాద సంస్థలకు పాక్‌ ఆర్మీ అందుబాటులో ఉంచుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Also Read: ‘గాజాకు పట్టిన గతే కశ్మీర్‌కు పడుతుందా’? చర్చలేవి?

WATCH:

#china #jammu-kashmir #pakistan #poonch #india
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe