Pakistan:పాపం పాకిస్తాన్...ఫ్యూయల్ లేక ఆగిన 48 ఫ్లైట్‌లు

పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది. అక్కడి ద్రవ్యోల్బణం తీవ్ర స్థాయికి చేరుకుంది. నిత్యావసర వస్తువులే కాక చమురు లాంటివి కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. 48 ఫ్లైట్‌లను పూర్తిగా రద్దు చేసింది. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ సర్వీస్‌లు నిలిపివేసింది.

New Update
Pakistan:పాపం పాకిస్తాన్...ఫ్యూయల్ లేక ఆగిన 48 ఫ్లైట్‌లు

పాకిస్తాన్ పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతోంది. అక్కడి పౌరులు జీవించడమే గగనమయ్యే పరిస్థితులు ఎదురవుతున్నాయి. చిన్న చిన్న వస్తువుల నుంచి ఫ్యూయెల్, ఇంధనాల వరకు అన్నీ ప్రియంగా మారిపోయాయి. తాజాగా పాకిస్తాన్ లో ఆయిల్, గ్యాస్ ధరలు పెరిగిపోవడంతో అక్కడి ఇంటర్నేషనల్ విమాన సంస్థ తమ ఫ్లైట్లను రద్దు చేసింది. విమానాలు నడపాలంటే ఇంధనం అవసరం కదా. మరి ఆ చమురే ఇప్పుడక్కడ బంగారమైపోయింది. తీవ్ర కొరత ఏర్పడింది. అందుకే పాక్ ఎయిర్ లైన్స్ అన్ని విమానాలనూ పక్కన పెట్టేసింది. సరిపడినంత ఇంధన సరఫరా లేకపోవడం వల్లే ఫ్లైట్‌లను రద్దు చేయాల్సి వచ్చిందని ఎయిర్ లైన్స్ ప్రతినిధులు తెలిపారు. 13 డొమెస్టిక్‌ ఫ్లైట్స్‌, 11 ఇంటర్నేషనల్ ఫ్లైట్‌లను రద్దుచేశారు. మిగతా వాటిన రీషెడ్యూల్ చేశారు. ఇప్పటికే టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఇతర మార్గాలను చూపిస్తోంది.యిర్‌పోర్ట్‌కి వచ్చే ముందే ఫ్లైట్ స్టేటస్‌ ఏంటో తెలుసుకోవాలని అధికారులు సూచించారు.

Also Read:ఇన్నర్ రింగ్ కేసు బెయిల్ పిటిషన్ విచారణ వచ్చేనెల 7కు వాయిదా

పాకిస్థాన్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కి అక్కడి ప్రభుత్వ స్టేట్ ఆయిలే ఫ్యుయెల్ సప్లై చేస్తోంది. అయితే ఎయిర్ లైన్స్ చాలా రోజుల నుంచి నష్టాల్లో ఉండడం వలన దీనికి చాలా రోజుల నుంచి డబ్బులు కట్టడం లేదు. దీంతో సప్లైని కట్ చేసేసింది పాకిస్థాన్ స్టేట్ ఆయిల్. ఫలితంగా ఎయిర్‌లైన్స్‌ భవిష్యత్‌ గందరగోళంగా మారింది. ఫ్యూయెల్ లేకుండా ఫ్లైట్స్ ను నడిపించలేక మొత్తం విమానాలనే ఆపేసింది. అప్పుల ఊబిలో ఉన్న ఎయిర్ లైన్స్ ఇప్పుడు దాన్ని ప్రైవేటీకరణ చేయాలని ఆలోచిస్తోంది. దీనికి తోడు ప్రభుత్వం నుంచి అందాల్సిన ఆర్థిక సాయమూ అందలేదు. ఇప్పటికిప్పుడు ఆ ఎయిర్‌లైన్స్ నష్టాల ఊబిలో నుంచి బయటపడాలంటే కనీసం 100 మిలియన్లు చెల్లించాల్సిందే.

ప్రస్తుతానికి సర్వీస్‌లను రద్దు చేసింది కానీ దానీకి శాశ్వత పరిష్కారం మాత్రం ఇది కాదని అంటోంది పాకిస్తాన్ ఎయిర్ లైన్స్. ప్రభుత్వం సహాయం చేయడానికి నిరాకరించడంతో ఏం చేయాలో తెలియక తల పట్టుకుని కూర్చుంది.

Advertisment
తాజా కథనాలు