Shadab Khan: అగార్కర్‌కు పాక్ ప్లేయర్ కౌంటర్ భారత్-పాక్ మ్యాచ్ ప్రారంభం కాకముందే యుద్ధ వాతావరణం నెలకొంది. పాక్ టీమ్‌ను విరాట్ కోహ్లీ చూసుకుంటాడని చీఫ్ సెలక్టర్ చేసిన వ్యాఖ్యలపై పాక్ ప్లేయర్ స్పందించాడు. ఎవరు ఎవర్ని చూసుకుంటారో మ్యాచ్ రోజు తెలుస్తుందన్నాడు. By Karthik 27 Aug 2023 in స్పోర్ట్స్ New Update షేర్ చేయండి భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినట్లే భావిస్తారు. మ్యాచ్ ప్రారంభం కాకముందునుంచే ఇరుజట్లకు చెందిన ప్లేయర్లు, మాజీ ప్లేయర్లు తమ టీమ్ గొప్పగా ఉందంటే, తమ టీమ్ మెరుగ్గా ఉందని చెప్పుకుంటారు. తాజాగా దీనిపై ఇటీవల చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చేసిన వ్యాఖ్యలకు పాక్ ప్లేయర్ షాదాబ్ ఖాన్ కౌంటర్ ఇచ్చాడు. మ్యాచ్‌లో ఎవరు పైచేయి సాధిస్తారనేది మ్యాచ్ రోజే తెలుస్తుందని, ఇరు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో ఏ టీమ్ అయినా గెలవాలనే చూస్తుందన్నాడు. ఇరు జట్ల మధ్య పోరు మాత్రం ఆసక్తికరంగా ఉండనుందన్నాడు. కాగా ఆసియా కప్ కోసం జట్టును ప్రకటించిన అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న అగార్కర్.. ఆసియా కప్‌లో పేస్ బౌలింగ్‌ను ఎదుర్కొనే టీమ్‌ను సిద్ధం చేశామన్నాడు. ముఖ్యంగా పాకిస్థాన్‌తో ఆడే మ్యాచ్‌ను మాజీ కెప్టెన్, రన్ మిషన్ విరాట్ కోహ్లీ చూసుకుంటాడని, మ్యాచ్‌ను అతడే గెలిపిస్తాడని అగార్కర్ ధీమా వ్యక్తం చేశాడు. గత ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్ టోర్నీలోనూ పాకిస్థాన్‌పై భారత్ గెలవడంలో విరాట్ కీలక పాత్ర పోషించాడని గుర్తు చేశాడు. ఆసియా కప్‌లో బుమ్రా బౌలింగ్‌ను ఎదర్కోవడం ప్రత్యర్ధి బ్యాటర్లకు కష్టంగా ఉంటుందని తెలిపాడు. మరోవైపు ఈ నెల 30 నుంచి పాకిస్థాన్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆసియా కప్ టోర్నీ ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్‌లో పాకిస్థాన్ నేపాల్‌తో తలపడనుంది. సెప్టెంబర్ 2 భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య బిగ్ ఫైట్ జరుగనుంది. భారత్ ఆసియా కప్ టోర్నీలో పూర్తి మ్యాచ్‌లను శ్రీలంక వేదికలపైనే ఆడనుంది. కాగా ఐసీసీ తాజాగా విడువల చేసిన వన్డే ర్యాంకింగ్‌లో పాకిస్థాన్ నెంబర్ వన్‌కు చేరుకోవడం పాక్‌కు కలిసి వచ్చే అంశం. ఈ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఆస్ట్రేలియా ఉండగా భారత్ ముడో స్థానంలో నిలిచింది. #virat-kohli #cricket #pakistan #india #asia-cup #agarkar #shadab-khan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి