జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్యాకేజీ స్టార్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ చంద్రబాబు(Chandrababu)ను గెలిపించేందుకే ప్రజల్లోకి వెళ్తున్నారన్నారు. ఏపీలో బీజేపీ, జనసేన కలిసి పోటీచేసి చివరకు టీడీపీని గద్దె ఎక్కించాలని చుస్తున్నాయన్నారు. ప్యాకేజీ స్టార్ గురించి ప్రజలకు తెలుసని ప్రజలు పవన్ ఎన్ని స్థానాల్లో పోటీ చేసినా గెలిపించరని జోస్యం చెప్పారు. సినిమాలు వేరు, రాజకీయం వేరని కేఏపాల్ తెలిపారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సినిమా డైలాగులు వేస్తే గెలుస్తాననుకుంటున్నారని విమర్శించారు.ఎన్ని తరాలైనా ప్యాకేజ్ స్టార్ అసెంబ్లీ మెట్లు ఒక్కబోరని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ ఇకనైనా టీడీపీ, బీజేపీతో కలిసి పోకుండా సొంతంగా ప్రజల సమస్యలు తీర్చడానికి పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందన్నారు. లేకుండా పవన్‌కు డిపాజిట్లు కూడా దక్కవన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) మండిపడ్డారు. కేసీఆర్ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బీఆర్‌ఎస్ బీజేపీకి బీ టీమ్‌గా పని చేస్తోందని విమర్శించారు. కవిత(kavitha)ను ఎక్కడ అరెస్ట్ చేస్తారో అనే భయంతో కేసీఆర్(kcr) బీజేపీకి అనుకూలంగా మారిపోయారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌కు 80 సీట్లు, బీజేపీకి 30 సీట్లు వచ్చేలా కేసీఆర్, నరేంద్ర మోడీ (Narendra Modi) మధ్య ఒప్పందం కుదిరిందన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో మార్పు కోరుకునేవారు తన పార్టీలోకి రావాలని కేఏ పాల్ పిలుపునిచ్చారు. ప్రజాశాంతి పార్టీ పంజాబ్ (Punjab) ఎన్నికలను తెలంగాణలో రిపీట్ చేస్తుందన్నారు. దీని కోసం తాము శనివారం నుంచే ప్రజల్లోకి వెళ్తామని కేసీఆర్ అవినీతి గురించి ప్రజలకు వివరిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత 9 ఏళ్లుగా కల్వకుంట్ల కుటుంబం మాత్రమే బాగుపడిందన్నారు. ఇటీవల కేసీఆర్ మనువడు హిమాన్షు (Himanshu) ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేయించారన్న కేఏ పాల్.. కేసీఆర్ తన మనువడిని చూసి నేర్చుకోవాలని ఎద్దేవా చేశారు.
తనను కొందరు రాజకీయ నాయకులు తిడుతున్నారని కేఏ ఎల్ ఆందోళన వ్యక్తం చేశారు. తనను తిట్టిన వారు మట్టిలో కలిసిపోతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో తనను గతంలో కత్తి మహేష్ (Kathi Mahesh) తిట్టారని, తన శాపం తగిలే కత్తి మహేష్ మృతి చెందాడన్నారు. తనను గతంలో జనగాం వద్ద పోలీసులు అరెస్ట్ చేశారని ఆయన గుర్తు చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ (ktr) కలిసి తనను అరెస్ట్ చేయించారన్నారు. త్వరలో వారి పదవి ఊడబోతోందని కేఏ పాల్ జోస్యం చెప్పారు.