జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్యాకేజీ స్టార్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ చంద్రబాబు(Chandrababu)ను గెలిపించేందుకే ప్రజల్లోకి వెళ్తున్నారన్నారు. ఏపీలో బీజేపీ, జనసేన కలిసి పోటీచేసి చివరకు టీడీపీని గద్దె ఎక్కించాలని చుస్తున్నాయన్నారు. ప్యాకేజీ స్టార్ గురించి ప్రజలకు తెలుసని ప్రజలు పవన్ ఎన్ని స్థానాల్లో పోటీ చేసినా గెలిపించరని జోస్యం చెప్పారు. సినిమాలు వేరు, రాజకీయం వేరని కేఏపాల్ తెలిపారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సినిమా డైలాగులు వేస్తే గెలుస్తాననుకుంటున్నారని విమర్శించారు.ఎన్ని తరాలైనా ప్యాకేజ్ స్టార్ అసెంబ్లీ మెట్లు ఒక్కబోరని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ ఇకనైనా టీడీపీ, బీజేపీతో కలిసి పోకుండా సొంతంగా ప్రజల సమస్యలు తీర్చడానికి పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందన్నారు. లేకుండా పవన్‌కు డిపాజిట్లు కూడా దక్కవన్నారు.
పూర్తిగా చదవండి..ప్యాకేజీ స్టార్ పవన్.. ఎన్నిస్థానాల్లో పోటీ చేసినా గెలవలేడు
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అవినీతికి పాల్పడుతున్నారని, జనసేన అధినేత డబ్బులకు అమ్ముడు పోయారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను తిట్టిన వారు త్వరలో మట్టిలో కలిసి పోతారన్నారు. కత్తి మహేష్ తనను తిట్టాడని, తన శాపంతో మట్టిలో కలిసిపోయారన్నారు

Translate this News: