మధ్యతరగతివారి సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు బీజేఈపీ ప్రభుత్వం నిర్ణయించుకుందని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మధ్యంతర బడ్జెట్‌లో భాగంగా ఇంటి నిర్మాణం, కొనుగోలుకు ప్రభుత్వం మద్దుతు ఇస్తుందని చెప్పారు. బస్తీలు, ఆద్దె ఇళ్ళల్లో ఉన్నవారి పొంత ఇంటికలను నెరవేరుస్తామని అన్నారు. ఆవాస్ యోజనా కింద మరో 2కోట్ల ఇళ్ళు నిర్మిస్తామని తెలిపారు. దీంతో 3 కోట్ల ఇళ్ల నిర్మాణం లక్ష్యాన్ని త్వరలో చేరుకోనున్నామని చెప్పారు. అలాగే ఆశా వర్కర్లందరికీ, అంగన్వాడీ వర్కర్లకు ఆయుష్మాన్ భారత్ పథకం వర్తిస్తుందని హామీ ఇచ్చారు. దాంతో పాటూ మౌలిక వసతుల రంగానికి 11.11లక్షల కోట్లు బడ్జెట్‌ను కేటాయించామని చెప్పారు. పాడి అబివృద్ధి రేతులకు గవర్నమెంటు సహాయం చేస్తుందని హామీ ఇచ్చారు.
Also read:300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్…నిర్మలా సీతారామన్