Train accident:వేగమే కొంపలు ముంచింది...విజయనగరం రైలు ప్రమాదం ప్రాథమిక నివేదిక

New Update
Train accident:వేగమే కొంపలు ముంచింది...విజయనగరం రైలు ప్రమాదం ప్రాథమిక నివేదిక

స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్....ఈ స్లోగన్ మనకు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తుంది. అవసరానికి మించిన వేగంతో జరిగిన, జరుగుతున్న ఎన్నో యాక్సిడెంట్లను మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఈ రూల్ ఒక్క రోడ్డు మీదన వెళ్ళేవాటికే అనుకుంటే పొరబడినట్టే. తాజాగా జరిగిన విజయనగరం ట్రైన్ యాక్సిడెంట్‌కు కారణం కూడా ఈ వేగమే. ఈ మార్గంలో రైలు కొన్ని చోట్ల తక్కువ వేగంతో ప్రయాణించాల్సి ఉంది. కానీ అలాంటి చోట్ల కూడా పరిమితికి మించి వేగంతో ప్రయాణించడం వల్లనే ప్రమాదం సంభవించింది. ఈ విషయాన్ని స్పీడ్ రికార్డ్ లో గుర్తించామని చెబుతున్నారు అధికారులు.

Also Read:హైదరాబాద్‌ కాంగ్రెస్ నేతల ఇళ్ళల్లో ఐటీ సోదాలు

వేగ నియంత్రణ పాటించకుండా ఉండడం మీద అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలెందుకు రాయగడ ప్యాసింజర్ రైలు వేగంగా వెళ్ళాల్సి వచ్చింది అన్న దాని మీద దర్యాప్తు చేస్తున్నారు రైల్వే హద్రతా కమీషనర్ ప్రణ్‌జీవ్ సక్సేనా. ఈతనితో పాటూ తూర్పు కోస్తా జోన్ సీనియర్ అధికారుల కమిటీ కూడా వివరాలను సేకరిస్తోంది. ఆ రోజు, ముందు రోజు విధినిర్వహణలో ఉన్న సిగ్నల్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌, లోకో పైలట్లు, స్టేషన్‌ మేనేజర్లు, గార్డులు, టీటీలతో పాటు గ్యాంగ్‌మన్లను విచారణకు పిలిచారు. దాదాపు 200 మందిని విచారించి...తుది నివేదిక సమర్పిస్తామని చెబుతున్నారు.

విజయనగరం రైలు ప్రమాదంలో 14 మంది చనిపోగా 100 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. మృతి చెందిన కుటుంబాలకు రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 2.5 లక్షలు, పాక్షికంగా గాయపడిన వారికి 50 వేల చొప్పున చెక్కులను అందజేశారు.

Also read:ట్రెక్కర్స్ కు స్వర్గధామం భూటాన్

Advertisment
తాజా కథనాలు