9000 Dengue Cases In Karnataka : కర్ణాటకలో డెంగ్యూ (Dengue) వ్యాధి కలవరపెడుతోంది. ఆ రాష్ట్రంలో దీని కేసుల సంఖ్య పది వేలకు చేరుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకు 9 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి బారినపడి ఇప్పటిదాకా ఏడుగురు మృతి చెందారు. జులై 13 వరకు మొత్తం 66,298 మందికి డెంగ్యూ పరీక్షలు చేయగా.. అందులో 9,082 మందికి పాజిటివ్‌గా తేలింది. గత 24 గంటల్లో 2,557 మందిని పరీక్షించగా.. 424 మందికి డెంగ్యూ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. జ్వరం వల్ల 353 మంది ఆసుపత్రిలో చేరగా.. వాళ్లలో 119 మంది గత 24 గంటల్లో ఆసుపత్రితో అడ్మిట్ అయినట్లు వైద్యాధికారులు తెలిపారు.
Also Read: ప్రధాని మోదీ రికార్డ్.. ఎక్స్‌లో 100 మిలియన్లు దాటిన ఫాలోవర్లు
మరోవైపు జనవరి నుంచి జులై 13 వరకు రాజధాని బెంగళూరు (Bangalore) పరిసర ప్రాంతాల్లో 2,830 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లోనే అక్కడ 202 డెంగ్యూ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇక చిక్కమగళూరులో జులై 13 వరకు 599 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. కర్ణాటక (Karnataka) లో అత్యధికంగా నమోదైన కేసుల్లో ఈ నగరం రెండో స్థానంలో ఉంది.
Also read: ఆహ్వానం లేకుండానే అంబానీ పెళ్లికి వెళ్లారు.. చివరికి