Pakistan: టాయిలెట్‌గా మారిన హనుమాన్ టెంపుల్..పాకిస్తాన్‌లో అవమానం

పాకిస్తాన్‌లో హిందువులకు ఘోర అవమానం జరిగింది. లాహార్‌ నగరంలో ఉన్న ఓ హనుమాన్ దేవాలయాన్ని చాలా దారుణంగా పబ్లిక్ టాయిలెట్‌గా మార్చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంత అన్యాయంగా ఎలా ఉంటారు అంటూ హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

New Update
Pakistan: టాయిలెట్‌గా మారిన హనుమాన్ టెంపుల్..పాకిస్తాన్‌లో అవమానం

Hanuman Temple: పాకిస్తాన్‌లో అందరూ ముస్లిమ్‌లే ఉంటారు. తమకు ఒక ప్రత్యేక దేశం కవాలన్ని ఉద్దేశంతోనే ఇండియా నుంచి పాకిస్తాన్ విడిపోయింది. దాని ముందు వరకూ ఆ దేశ ప్రాంతంలో కూడా హిందువుల, ముస్లిమ్‌లు అందరూ కలిసి ఉండేవారు. దీని వలన పాకిస్తాన్‌లో కూడా చాలా హిందూ దేవాలయాలు ఉండేవి. కాల క్రమంలో వాటిన పడ గొట్టేయడయో, లేకపోతే మరో విధంగానో మార్చేయడమో చేశారు. ఇలా చేయడంలో చాలా అన్యాయాలు కూడా జరిగాయని తెలుస్తోంది. దీనికి సంబంధించి తాజాగా ఒక వీడియో బయటపడింది. ఇది ఇప్పుడు వైరల్‌గా మారింది.

పాకిస్తాన్‌లోని లాహోర్‌లో నగరం మధ్యలో చరిత్ర ఆనవాళ్ళు ఇంకా కొంత మిగిలే ఉన్నాయి. ఇందులోనే బన్సీ మందిర్ అని పిలిచే హనుమాన్ టెంపుల్ ఒకటి ఉంది. 20 శతాబ్దానికి చెందిన ఆలయంగా ఇది గుర్తింపు పొందింది. అప్పట్లో ఒక సంపన్న కుటుంబం దీన్ని నిర్మించింది. ఇప్పుడు దాని పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆ ఆలయాన్ని అలా శిథిలం చేసినా బాగానే ఉండేది. కానీ అన్యాయంగా హనుమాన్ టెంపుల్‌ని పబ్లిక్ టాయిలెట్‌గా మార్చేశారు. పాకిస్తాన్‌లో మతపరమైన మైనారిటీ చాలానే ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ముస్లిమ్‌లకు మనం ఇచ్చే గౌరవం అక్కడ హిందువులకు ఉండదు. అక్కడ హిందువులను, దేవాలయాలను చాలా తక్కువ చేస్తారు. అదే క్రమంలో బన్సీ మందిర్‌కు కూడా ఈ దుస్థితిని పట్టించారు.

అయితే పాకిస్తాన్ ఈ చర్య హిందువులకు కోపం తెప్పిస్తోంది. ఎంత విద్ఏవషం ఉంటే మాత్రం ఇతలా చేస్తారా అంటూ హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బన్సీ హనుమాన్ ఆలయానికి చెందిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీని కింద హిందువులు వరుసగా కామెంట్లు చేస్తున్నారు. ఇది చాలా అవమానకరమైన సంఘటనని ఒకరు, పాకిస్తాన్‌లో మైనారిటీలు చాలా కష్టాలుఅనుభవిస్తున్నారని ఇంకొంతమంది కామెంట్లు పెడుతున్నారు.

Also Read:Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్‌ న్యూస్..ఇక మీదట 20 రూ.లకే భోజనం

Advertisment
తాజా కథనాలు