Budget Session:పేదవారి అభివృద్ధే...దేశాభివృద్ధి..మధ్యంతర బడ్జెట్ లో నిర్మలా సీతారామన్

పార్లమెంటులో మధ్యంతర బడ్జెట్ ప్రసంగం మొదలైంది. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను చదువుతున్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమ ప్రభుత్వం పని చేసిందని..పేదల అభివృద్ధే లక్ష్యంగా పని చేశామని చెప్పారు.

New Update
Budget Session:పేదవారి అభివృద్ధే...దేశాభివృద్ధి..మధ్యంతర బడ్జెట్ లో నిర్మలా సీతారామన్

Parliament:సరిగ్గా ఉదయం పదకొండు గంటలకు పార్లమెంటులో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రసంగాన్ని మొదలుపెట్టారు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆరవసారి నిర్మలా బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఈసారి బడ్జెట్ డిజిటల్ రూపంలో అందరికీ అందుబాటులో ఉంది. గత పదేళ్ళల్లో భారత దేశం, బీజేపీ గవర్నమెంట్ సాధించిన ప్రగతిని చెబుతున్నారు నిర్మలా సీతారామన్. సబ్ కా పాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్...ఇదే మంత్రంగా పదేళ్ళ నుంచి బీజేపీ ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. పదేళ్లలో దేశం వేగంగా మార్పు చెందింది. ఆర్ధికంగా అభివృద్ధి చెందింది. బాధ్యతాయుతంగా ఆర్ధిక సంస్కరణలు చేశాం. మోడీ తెచ్చిన సంస్కరణలు 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడేందుకు ప్రభుత్వం సహాయ పడింది అన్నారు ఆర్ధి్ మంత్రి.2047కి వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం ఉందనీ...దాని కోసం అవినీతి గణనీయంగా తగ్గించాం. పాలనలో పారదర్శకతను పెంచామని చెప్పారు. ఆత్మ నిర్భర్ భారత్‌లో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యులు అయ్యారు. కొత్త సంస్కరణలతో పారిశ్రామిక వేత్తలు పెరిగారు. అన్నదాతల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.

Also read:Budget 2024 Live Updates🔴: మధ్యంతర బడ్జెట్‌.. మినిట్ టు మినిట్ అప్డేట్స్!

గ్రామ స్థాయిలో అభివృద్ధిని తీసుకెళ్ళామని చెప్పారు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. అందరికీ ఇళ్లు, విద్యుత్‌, గ్యాస్‌, బ్యాంక్‌ అకౌంట్లు ఇచ్చాం. ఉచిత రేషన్‌తో ఆకలిబాధలను నిర్మూలించాం . 80 కోట్ల మందికి ఉచిత రేషన్‌ అందిస్తున్నాం. కనీస మద్దతు ధరను అందిస్తున్నాం.సామాజిక న్యాయాన్ని పొలిటికల్‌ నినాదంగా మార్చుకుని మబరీ పని చేస్తున్నామని చెప్పారు. సంక్షేమ పథకాలు అందరికీ చేరువయ్యాయి .నాలుగు వర్గాల అభ్యున్నతే ప్రధాన లక్ష్యంగా చేసుకున్నామని...పేదలు, మహిళలు, యువత, అన్నదాత అభివృద్ధే మా లక్ష్యమని చాటి చెప్పారు. మా ప్రభుత్వంలో GDP బాగా పెరిగింది.GDP లో G-గవర్నెన్స్‌, D-డెవలప్‌మెంట్‌, P-పెర్ఫార్మెన్స్‌ అని వివరించారు నిర్మలా సీతారామన్.

Advertisment
Advertisment
తాజా కథనాలు