Wrestlers Row: 'ఉరి వేసుకోవాలా?' రెజర్లపై మరోసారి నోరుపారేసుకున్న బ్రిజ్‌ భూషణ్‌!

కాంగ్రెస్‌ ఒడిలో కూర్చొని పలువురు రెజర్లు నిరసన చేస్తున్నారంటూ ఆరోపించారు బీజేపీ ఎంపీ,మాజీ WFI చీఫ్‌ బ్రిజ్‌భూషణ్. రెజర్లతో పోరాడటానికి తాను ఉరి వేసుకోవాలా? అని ప్రశ్నించాడు. WFI చీఫ్‌గా బ్రిజ్ సన్నిహితుడు ఎన్నికను రెజర్లు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.

Wrestlers Row: 'ఉరి వేసుకోవాలా?' రెజర్లపై మరోసారి నోరుపారేసుకున్న బ్రిజ్‌ భూషణ్‌!
New Update

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) చీఫ్‌గా బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ శరణ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ ఎన్నిక కావడంపై రగడ ఆగడం లేదు. సంజయ్‌ సింగ్‌ ఎన్నికను రెజర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సంజయ్‌ సింగ్‌ చీఫ్‌గా ఎన్నిక కావడమంటే బ్రిజ్‌ భూషణ్‌ ఎన్నికైనట్టేనని రెజర్లు ఆరోపిస్తున్నారు. ఈ ఎన్నికకు నిరసనగా ఇప్పటికే కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రముఖ రెజర్‌ సాక్షి మాలిక్‌ రెజ్లింగ్‌కు గుడ్‌బై చెబుతున్నట్టు ప్రకటించారు. మీడియా సమావేశంలో ఏడ్చేశారు సాక్షి. అటు వినేశ్‌ సైతం కన్నీరు ఆపుకోలేకపోయింది. ఇదే సమయంలో స్టార్ రెజర్ల బజరంగ పూనియా తన పద్మశ్రీని వెనక్కి ఇస్తున్నట్టు ట్విట్టర్‌లో నేరుగా మోదీకి ట్యాగ్ చేశారు. పద్మశ్రీ అవార్డును మోదీకి రిటర్న్ ఇచ్చేందుకు ప్రధాని ఇంటికి బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తన పద్మశ్రీ అవార్డును ఫుట్‌పాత్‌పైనే పెట్టి వెళ్లిపోయాడు పూనియా. రెజర్లు ఇంత తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే అదే సమయంలో బ్రిజ్‌ భూషణ్‌ నోటికి పని చెప్పాడు.

Also Read: రోహిత్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఐపీఎల్‌ నుంచి హార్దిక్‌ పాండ్యా జౌట్?

కాంగ్రెస్‌ చెప్పింది చేస్తున్నారు:
నిరసన వ్యక్తం చేస్తున్న రెజ్లర్లు కాంగ్రెస్ ఒడిలో కూర్చున్నారని ఆరోపించారు బ్రిజ్‌ భూషణ్‌. ఇతర మల్లయోధులు కాంగ్రెస్ ఒడిలో కూర్చోలేదని.. అందుకే వారు ఎవరూ మద్దతు ఇవ్వడం లేదని చెప్పుకొచ్చారు. వారితో పోరాడటానికి తాను ఉరి వేసుకోవాలా? అని ప్రశ్నించాడు. '11 నెలలకు పైగా రెజ్లింగ్ అభివృద్ధి ప్రభావితమైంది. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగాయి. మా క్యాంపు నుంచి సంజయ్ సింగ్ అలియాస్ బబ్లూ స్పష్టమైన మెజారిటీతో ఎన్నికయ్యారు. ఇతర అభ్యర్థి 33 ఓట్ల తేడాతో ఓడిపోయారు' అని వ్యాఖ్యానించారు బ్రిజ్‌. తన శిబిరం క్రీడ అభివృద్ధికి కృషి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు.

'వారు మాపై నెలల తరబడి దుర్భాషలాడుతున్నారు. అలా చేసే హక్కు వారికి ఎవరు ఇచ్చారు?' అని బ్రిజ్‌ ప్రశ్నించాడు. ఇక వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియాతో సహా అగ్రశ్రేణి ఒలింపియన్లు బ్రిజ్‌ భూషణ్‌ను అరెస్ట్ చేయాలని ఈ ఏడాది ఆరంభం నుంచి డిమాండ్‌ చేస్తున్నారు. ఒక మైనర్‌తో సహా ఏడుగురు రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు బ్రిజ్‌ భూషణ్‌పై ఆరోపణల ఉన్నాయి. ఈ మాజీ WFI చీఫ్‌పై వచ్చిన ఫిర్యాదులలో అతను అనుచితంగా తాకడం, అమ్మాయిల ఛాతీపై చేయి వేయడం, వెంబడించడం లాంటి చర్యలకు పాల్పడినట్టు కంప్లైంట్ ఉంది.

Also Read: రష్మిక మతాంతర వివాహంపై నెట్టింట చర్చ.. పెళ్లి చేసిన వ్యక్తి ఏమన్నారంటే

WATCH:

#sports-news #sakshi-malik #brij-bhushan-singh-sharan #bajrang-punia #wrestlers-protest
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe