Budget 2024: కేంద్ర బడ్జెట్‌.. కాంగ్రెస్‌ మేనిఫెస్టోను కాపీ పేస్ట్ చేశారన్న రాహుల్

2024-25 ఆర్థిక ఏడాదికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో కాంగ్రెస్ మేనిఫెస్టోను కాపీ చేశారని.. AA( అంబానీ, అదానీ)లకు ప్రయోజనం చేకూర్చారంటూ రాహుల్‌గాంధీ ఎక్స్‌ వేదికగా విమర్శించారు.

Budget 2024: కేంద్ర బడ్జెట్‌.. కాంగ్రెస్‌ మేనిఫెస్టోను కాపీ పేస్ట్ చేశారన్న రాహుల్
New Update

Rahul Gandhi Over Union Budget 2024: 2024-25 ఆర్థిక ఏడాదికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థి మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఎన్డీయే ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక.. తొలిసారిగా పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఇదే. తొమ్మిది సూత్రాల ఆధారంగా బడ్జెట్‌ను రూపకల్పన చేసినట్లు పేర్కొన్నారు. వ్యవసాయం, ఉపాధికల్పన, సామాజిక న్యాయం, తయారీ-సేవలు, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, ఆవిష్కరణ, పరిశోధన-అభివృద్ధి, తర్వాతితరం సంస్కరణలు.. ఇలా మొత్తం తొమ్మిది సూత్రాల ప్రాధాన్యంగా తీసుకుని బడ్జెట్‌ను తీసుకొచ్చినట్లు నిర్మలా సీతారామన్‌ తన ప్రసంగలో ప్రకటించారు. ఈ బడ్జెట్‌ మొత్తంలో వివిధ రంగాలన్నింటికీ కలిపి రూ.48.21 లక్షల కోట్ల కేటాయింపులు చేశారు.

Also Read: వరాలే ఎక్కువ.. వాతలు తక్కువే.. బడ్జెట్ ప్రధానాంశాలు ఇవే

ఇక బడ్జెట్‌ పరిమాణం రూ.48.21 కోట్లు కాగా.. ఇందులో మొత్తం ఆదాయాన్ని రూ.32.07 లక్షల కోట్లుగా, అందులో పన్ను ఆదాయాన్ని రూ.28.83 లక్షల కోట్లుగా చూపించారు. ఈ ఏడాది ద్రవ్యలోటు 4.9 శాతంగా ఉండొచ్చని బడ్జెట్‌లో అంచనా వేశారు. మరోవైపు అప్పులు, పన్నేతర ఆదాయాలు రూ.16 లక్షల కోట్లుగా అంచనా వేశారు. నూతన పింఛన్‌ విధానంలో కూడా త్వరలో మార్పులు చేయనున్నట్లు చెప్పారు.

అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై విపక్ష నేతలు తీవ్ర విమర్శలు చేశారు. సాధారణ పౌరులను ఎలాంటి ఉపశమనం లేకుండా AA( అంబానీ, అదానీ)లకు ప్రయోజనం చేకూర్చారంటూ ఎక్స్‌ వేదికగా విమర్శించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను, గతంలో ఉన్న బడ్జెట్‌ను కాపీ, పేస్ట్‌ చేశారంటూ ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్‌ న్యాయ పత్ర (మేనిఫెస్టో)లో 'పెహ్లీ నౌకరీ పక్కి' అని ప్రతిపాదించిన అప్రెంటిస్‌షిప్‌ ప్రోగ్రామ్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి కాపీ చేసి బడ్జెట్‌లో పెట్టారంటూ కాంగ్రెస్ సీనియర్ జైరాం రమేష్ విమర్శించారు.

ఈ బడ్జెట్‌ను శివసేన (UBT) ఎంపీ ప్రియాంక చతుర్వేది ‘పీఎం సర్కార్‌ బచావో యోజనా’ అని పిలవాలంటూ సెటైర్‌ వేశారు. ఈ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు ఉండాలంటే.. తమ మిత్రపక్షాలను సంతోషపెట్టాల్సిన అవసరం ఉందని వాళ్లు గ్రహించారంటూ విమర్శలు చేశారు.

పార్లమెంటు ఎన్నికల తర్వాత.. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ఆర్థిక మంత్రి చదవడం తెలిసి ఆనందం వ్యక్తం చేస్తున్నానంటూ మాజీ కేంద్రమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత పి.చిదంబరం ఎక్స్‌ వేదికగా ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలోని 30వ పేజీలో వివరించిన ఉపాధి సంబంధిత పోత్సాహకం (ELI)ను బడ్జెట్‌లో తీసుకొచ్చినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాని తెలిపారు.


#telugu-news #rahul-gandhi #national-news #union-budget-2024 #nirmala-sitharaman
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe