3 రోజులు ఏం సరిపోతాయి? అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ప్రతిపక్షాల గుర్రు

ఈ దఫా నిర్వహిస్తున్న అసెంబ్లీ సమావేశాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపి అధికార బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సిద్ధమవుతున్నాయి. కేవలం మూడు రోజుల పాటే ఈ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

New Update
3 రోజులు ఏం సరిపోతాయి? అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై  ప్రతిపక్షాల గుర్రు

Opposition demands for more days of Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు(Telangana Assembly Sessions) మూడు రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో శుక్రవారం (4.8.23) వరదలపైన, శనివారం (5.8.23) బిల్లులపైన చర్చించాలని నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై బీఏసీ సమావేశంలో చర్చించారు. స్పీకరు పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం ఏర్పాటయింది. ఈ సందర్బంగా ఎక్కువ రోజులు సమావేశాలు నిర్వహించాలని ప్రతిపక్ష నేతలు పట్టుపట్టారు. భారీవర్షాలు దీనిపై ప్రభుత్వం తీసుకున్న చర్యలు అంశంపై చర్చంచాలని అధికార బీఆర్ఎస్ పార్టీ(BRS Party) తరపున మంత్రులు ప్రశాంతరెడ్డి, హరీష్ రావు, కాంగ్రెస్ తరపున మల్లు భట్టివిక్రమార్క, ఎంఐఎం తరపున అక్బరుద్దీన్ ఓవైసీ సమావేశాలకు హాజరయ్యారు.

publive-image

సాయన్నకు ఘనంగా నివాళి

ఇటీవల కన్నుమూసిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు అసెంబ్లీ ఘనంగా నివాళులు అర్పించింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే సీఎం కేసీఆర్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టి తనకు సాయన్నతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సాయన్న వివాదరహితుడని అందరితో కలుపుగోలుగా ఉండేవాడని అన్నారు. నాలుగు దశాబ్దాల పాటు రాజకీయాల్లో వివిధ హోదాల్లో పనిచేశారని తెలిపారు. ఇటీవల కంటోన్మెంట్లను నగరపాలికల్లో కలపాలని కేంద్రం సంకల్పించిన విషయాన్ని చెబుతూ, ఈ నిర్ణయం అమలయితే, సాయన్న కోరిక నెరవేరినట్టవుతుందని పేర్కొన్నారు.సాయన్న కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు...

అసెంబ్లీ ముట్టడికి వచ్చిన యూత్ కాంగ్రెస్ నేతలను అడ్డుకున్న పోలీసులు..

నిరుద్యోగ భృతి వెంటనే ఇవ్వాలని, ఉద్యోగాల భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి యూత్ కాంగ్రెస్ పిలుపునిచ్చింది. అసెంబ్లీ వైపు దూసుకొస్తున్న యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి , నగర అధ్యక్షుడు మోటా రోహిత్ పాటు ఇతర నేతలను పోలీసులు అడ్డుకున్నారు.
అనంతరం వారిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు