Hair Tips: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య జుట్టు రాలడం. చిన్న వయసులోనే జుట్టు మొత్తం ఊడిపోయి బట్టతల వచ్చేస్తోంది. దీంతో మానసికంగా కుంగిపోతుంటారు. ఎన్నో వేల రూపాయలు ఖర్చు చేసి ఆపరేషన్లు చేయించుకుంటారు. మరికొందరు వందలాది రూపాయలు వెచ్చించి మార్కెట్‌లో దొరికే రకరకాల ఆయిల్స్‌ని వాడుతుంటారు. అయినా ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. బట్టతలకు ఇంట్లోనే సులభంగా ఆయుర్వేద ఆయిల్ తయారు చేసుకోవచ్చు. ఉల్లిపాయ, కొబ్బరి నూనె, కరివేపాకు ఆకు, మిల్కీ ఆయిల్‌తో బట్టలపై కూడా జుట్టు పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. కేవలం 15 రోజుల్లో అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. ఈ నూనెను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.
ఉల్లిపాయ నూనె ఉపయోగాలు:
ఉల్లిపాయ రసం జుట్టుకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రతిరోజు వాడటం వల్ల జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఉల్లిపాయలు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఎక్కువ జుట్టు రాలడం లేదా చాలా సన్నగా ఉన్నవారు ఈ నూనె వాడుకోవచ్చు. ఈ నూనె వాడటం వల్ల తలపై రక్త ప్రసరణను పెరుగుతుంది. జుట్టు సంబంధిత సమస్యలు ఉండవు.
ఉల్లిపాయ నూనెకు కావాల్సిన పదార్థాలు
కొబ్బరి నూనె - 200 మి.లీ.
తరిగిన పెద్ద ఉల్లిపాయ
కరివేపాకు - ఒక కప్
ఉల్లిపాయ నూనెకు తయారీ విధానం:
1.ఉల్లిపాయను ముక్కలు కోసి మిక్సీలో వేయండి. ఆ తర్వాత కరివేపాకు వేయండి, దాన్ని పేస్ట్ పట్టి పక్కకి పెట్టుకోండి.
2.ఒక బాండీలో పేస్ట్ వేసి వేడి చేయండి. అందులో కొబ్బరి నూనె కలపండి.
3. 5-10 నిమిషాల పాటు బాగా మరించండి.
4. మంట తక్కువగా పెట్టి మరో 15 నిమిషాలు ఉడికించాలి. కలర్ మారిన తర్వాత దించుకోండి.
5. ఒక రాత్రి మొత్తం ఈ మిశ్రమాన్ని అలాగే వదిలేయాలి.
6. ఉదయం ఈ నూనెను జల్లెడ పట్టి పెట్టుకోండి.
7. ఒక సీసాలో నూనె నింపండి. వారానికి ఒకసారి జుట్టుకు రాసుకోండి.
ఇది కూడా చదవండి: కళ్ల సౌందర్యానికి 3 వేల ఏళ్ల నాటి మస్కరాను తయారు చేసే పద్ధతి
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.