Hyderabad JNTU : ప్రస్తుతం మనిషి సగటు ఆయుఃప్రమాణం 70 ఏళ్లు. అయితే, ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుంది. 100 ఏళ్ళు పైబడి జీవించి రికార్డులకు ఎక్కిన వారూ ఉన్నారు. ప్పపంచం చాలా మారిపోయింది. వైద్యరంగం విపరీతంగా అభివృద్ధి చెందిపోయింది. పెద్ద పెద్ద రోగాలు సైతం ప్రస్తుత వైద్యం ముందు తలవంచేస్తున్నాయి.దీంతో మనిషి ఆయుఃప్రమాణం పెరిగిపోయింది. ఇది భవిష్యత్తులో మరింత పెరుగుతుంది అంటున్ని ఇస్రో(ISRO) ఛైర్మన్ ఎస్. సోమనాథ్(Somanath). శరీరంలో పాడైపోయిన అవయవాలు, చనిపోయే దశలో ఉన్న జీవకణాలను మార్చడం ద్వారా 200 నుంచి 300 సంవత్సరాలు జీవించే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
ఈ ఏడాదిలోనే అంతరిక్షంలోకి మానవులు
హైదరాబాద్ జేఎన్టీయూ(Hyderabad JNTU) 12వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిధిగా ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ హాజరయ్యారు. అందులో కాలేజీ విద్యార్ధులతో ముచ్చటించారు. ఇస్రో ప్రస్తుతం చేపట్టిన ప్రాజెక్టుల గురించి మాట్లాడారు. తుఫాన్లు, భారీ వర్షాలు ఎప్పుడు? ఎక్కడ? వస్తాయన్నది కచ్చితంగా తెలుసుకునేందుకు ఈ ఏడాది పీఎస్ఎల్వీ(PSLV), జీఎస్ఎల్వీ(GSLV) లను కక్ష్యలోకి పంపుతున్నామని చెప్పారు. మనుషులను అంతరిక్షంలోకి పంపే ‘గగన్‌యాన్ మిషన్’(Gaganyaan Mission) ను కూడా ఈ ఏడాదిలోనే నిర్వహించనున్నట్టు చెప్పారు. విద్యార్థులు రోబోటిక్ పరిజ్ఞానం పెంచుకుని అత్యాధునిక రోబోలు సృష్టిస్తే అంగారక, శుక్రగ్రహాలపై ఇస్రో చేపట్టే ప్రయోగాల్లో వినియోగించుకుంటామని చెప్పారు.
Also read : యూట్యూబ్‌లో టాప్ 10లో 7 మన పాటలే..
ఫెయిల్యూర్స్ అందరికీ ఉంటాయి..
స్నాతకోత్సవంలో విద్యార్ధులను ఉత్సాహపరిచేలా మాట్లాడారు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్. ఫెల్యూర్స్ అందరికీ ఉంటాయని...వాటిని దాటుకుని వస్తేనే సక్సెస్ ఉంటుందని అన్నారు. తాను కూడా ఒకటి రెండు పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని చెప్పుకొచ్చారు. వ్యక్తిగతంగా, వృత్తిగతంగా ఎదురయ్యే అపజయాలే విజయానికి నిజమైన సోపానాలని ఉద్ఘాటించారు. చంద్రయాన్-3 విజయవంతం కావడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయని, అంతకుముందు రెండుసార్లు విఫలమైన విషయాన్ని అంతా మర్చిపోయారని ఆయన గుర్తు చేశారు. రాకెట్లు, ఉపగ్రహాల తయారీలో తాను కూడా తప్పులు చేశానని ఒప్పుకున్నారు.