Health Benefits: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ కూరను ట్రై చేయండి

బెండకాయలో కేలరీలు చాలా తక్కువ ఉంటాయి. నీటిలో కరిగే, నీటిలో కరగని ఫైబర్ రెండింటికి మంచి మూలం శరీరంలోని పీచు మెల్లగా పెగుతుంది. బెండకాయ నానబెట్టిన నీరు వల్ల దగ్గు, గొంతు వాపు, గొంతులో దురద వంటి సమస్యలతోపాటు గుండెకు బెండకాయ అద్భుతంగా పనిచేస్తుంది.

Health Benefits: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ కూరను ట్రై చేయండి
New Update

Health Benefits okra: సాధారణంగా బెండ వంటలో కూరగాయల్లో ఉపయోగిస్తున్నారు. బెండకాయలో ఫాలీఫెనాల్స్‌ అధికంగా ఉంటాయి. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్‌ గుణాలు కొలెస్ట్రాల్‌, రక్తపోటు, వాపు ప్రక్రియ తగ్గటానికి ఉపయోగపడుతుంది. రక్తంలో గ్లూకోజు మోతాదులు స్థిరంగా ఉంచేదుకు బెండకాయ బెస్ట్‌ అని పల అధ్యయనాలు చెబుతున్నాయి. బెండకాయను లేడీస్ ఫింగర్‌ అని కూడా పిలుస్తారు. సహజంగా బెండకాయ ఎరుపు, ఆకుపచ్చ రెండు రంగులలో ఉంటాయి. ఈ రెండు రకాలు ఒకే రకమైన రుచిని ఇస్తాయి. ఎరుపు రంగులో ఉన్న బెండను వండినప్పుడు అది ఆకుపచ్చగా మారుతుంది.

ఇది కూడా చదవండి: డస్ట్‌ అలర్జీతో ఇబ్బందిగా ఉందా..? ఈ సమస్యకు ఇలా చెక్‌ పెట్టండి

అయితే బెండలో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. గుండె (heart) ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆహారంలో బెండకాయ (Okra)ను తీసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. భోజనంలో బెండ తినటం వల్ల కొలెస్ట్రాల్‌ తగ్గుతుందని జంతువులపై చేసిన అధ్యయనాల్లో వెల్లడైంది. అదే టైంలో మనుషుల్లోనూ బెండకాయ ఇటువంటి ప్రభావమే చూపుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

నీటిలో కరిగే పోషకం

బెండకాయలను ఆవిరి మీద ఉడికించడం, లేదా తక్కువ నూనెలో వేయించి తింటే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. బెండలో రక్తంలో గ్లూకోజు త్వరగా కలవకుండా ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే పీచూ పరోక్షంగా గుండెకు మంచి చేస్తుంది. బెండలో విటమిన్లు-C, K1, విటమిన్-సీ అనేది నీటిలో కరిగే పోషకం. ఇది ఎక్కువగా రోగనిరోధక పనితీరుకు దోహదపడుతుంది. అయితే.. విటమిన్- K1 అనేది కొవ్వులో కరిగే విటమిన్.. ఇది రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది. బెండలో కేలరీలు, పిండి పదార్థాలు తక్కువ గానీ.. కొంత ప్రోటీన్, ఫైబర్ ఉంటాయి. తగినంత ప్రోటీన్ తినడం, రక్తంలో చక్కెర నియంత్రణ, ఎముక నిర్మాణం , బరువు నిర్వహణ, కండర ద్రవ్యరాశి కోసం బెండను తీంటే ప్రయోజనాలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: ఉసిరి దీపం వలన కలిగే ప్రయోజనాలేంటి?

#tips #health-benefits #heart #okra-curry
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe