ఆ రాష్ట్రంలో ముగిసిన నామినేషన్ల పర్వం.. ఎంతమంది పోటీ చేయనున్నారంటే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు దగ్గరికొస్తున్నాయి. ఈ నేపథ్యంలో మిజోరాంలోని అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్లు ముగిశాయి. నామినేషన్ల ఉపసంహరణ గడవు సోమవారంతో ముగియడంతో అధికారులు.. అభ్యర్థుల వివరాలను వెల్లడించారు. ఇక నవంబర్ 7న ఆ రాష్ట్రంలో ఒకే దశలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 174 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. 27 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీలో దిగనున్నట్లు అధికారులు తెలిపారు. By B Aravind 23 Oct 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి మరికొద్ది రోజుల్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు హోరాహోరీగా ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే పలు పార్టీలు తమ అభ్యర్థులను కూడా ప్రకటించేశాయి. అయితే తాజాగా మిజోరాం అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్లు ముగిశాయి. నామినేషన్ల ఉపసంహరణ గడవు నేటితో ముగియడంతో అధికారులు.. అభ్యర్థుల వివరాలను వెల్లడించారు. ఇక నవంబర్ 7న మిజోరాంలో ఒకే దశలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 174 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 5 రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను పోటీలోకి దించాయని.. అలాగే 27 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నట్లు పేర్కొన్నారు. Also Read: కుక్కల దాడిలో మరణించిన వాఘ్ బక్రీ గ్రూప్ డైరెక్టర్ ఇక ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసిన 174 మంది అభ్యర్థుల్లో.. 16మంది మహిళలు కూడా ఉన్నట్లు మిజోరం అదనపు చీఫ్ ఎలక్టోరల్ అధికారి హెచ్ లియాంజెలా వెల్లడించారు. 2018 ఎన్నికలతో పోల్చిచూస్తే.. ఈ ఎన్నిక్లలో పోటీచేసే అభ్యర్థుల సంఖ్య తక్కువగానే ఉందని తెలిపారు. ఇదిలా ఉండగా.. మిజోరాం రాష్ట్రంలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అక్టోబర్ 20వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించారు. 21న నామినేషన్ల పరిశీలన జరిగింది. ఇక ఉపసంహరణ గడువు అక్టోబర్ 23తో మగిసింది. మిజోరాంలో నవంబర్ 7న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న మిగతా నాలుగు రాష్ట్రాలతో సహా.. ఓట్లు లెక్కించనున్నారు. అయితే ఈ ఎన్నికల్లో మిజోరాం మొత్తం 8,56,868 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మరోవైపు ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. లోక్ సభ ఎన్నికలపై ప్రభావం చూపుతాయని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణ, మిజోరాంలో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతుండగా.. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య గట్టి పోటీ ఉండనుందని అంచనా వేస్తున్నారు. #telugu-news #national-news #assembly-elections #mizoram మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి