Whatsapp New Feature: వాట్సాప్ యూజర్స్ కోసం తరుచుగా కొత్త ఫీచర్స్ ను తీసుకొస్తూనే ఉంటుంది. అందుకే సోషల్ మీడియాలో ఎప్పుడూ ఇది టాప్ పొజిషన్ లో ఉంటుంది. ప్రస్తుతం వాట్సాప్ లేకుండా ఏ పనీ జరగడం లేదంటే అతిశయోక్తి కాదు. అంతలా జనాల్లో పాతుకుపోయిన వాట్సాప్ తాజాగా మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ప్రకారం ఫోటోలు, వీడియోలు ఇంకా మిగతావి అన్నీ కూడా ఇంటర్నెట్ లేకుండానే ఆఫ్‌లైన్‌లో షేర్ (Offline Sharing) చేసుకోవచ్చును. ఈ ఫీచర్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను వాట్సాప్ ఫీచర్స్‌ను ట్రాక్ చేసే వాబీటాఇన్ఫో తెలిపింది.
ఈకొత్త ఫీచర్ ఇంకా అందుబాటులోకి రాలేదు కానీ త్వరలోనే వస్తుందని తెలుస్తోంది. ఇప్పటి వరకు వాట్సాప్‌లో ఏం చేయాలన్ని ఇంటర్నెట్ ఉండాల్సిందే. ఇంటన్రెట్ లేకపోతే వాట్సాప్ ఎందుకూ పనికి రాదు. దీనివలన చాలా సార్లు ఇబ్బందులు కూడా ఎదురవుతుంటాయి. మనం ఏదో అర్జంటుగా ఫోటో, లేదా వీడియోల్లాంటివి పంపాలంటే ఇంటర్నెట్ వచ్చేవరకూనో లేదా అది ప్లేస్‌కో పోయి మెసేజ్ చేయాల్సి వచ్చేది కానీ ఇప్పుడు ఆ ఇబ్బందులు ఏమీ లేకుండా ఆఫ్‌లైన్‌లో కూడా మీడియాకు సంబంధించినవి ఏమైనా పంపేసుకోవచ్చును. ఇలా పంపిన వాటికి కూడా ఎన్‌క్రిప్షన్ అవైలబుల్‌గా ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా టెస్టర్లకు అందుబాటులో ఉంది. ఇది కనుక విజయవంతం అయితే అందరికీ అందుబాటులోకి వస్తుంది. దీనికి సంబంధించిన స్కరీన్ షాట్ కూడా బయటకు వచ్చింది. ప్రస్తుతం ఇంటర్‌నెట్‌ను వినియోగించకుండా ఫైల్స్‌ను షేర్ చేసేందుకు బ్లూటూత్, షేర్‌ఇట్, నియర్‌బై షేర్ అప్లికేషన్స్‌తో ఫైల్స్‌ను ఉపయోగిస్తున్నారు. ఇక వాట్సాప్‌లో ఈ ఫీచర్ ఎనేబుల్ చేసుకోవాలంటే..వాట్సాప్ (Whatsapp) సిస్టమ్ ఫైల్, ఫోటో గ్యాలరీ అనుమతినివ్వాలి.
మరోవైపు ఈ మధ్యనే వాట్సాప్‌లో ఏఐ టెక్నాలజీని ప్రవేశపెట్టారు. ప్రస్తుతం అన్ని ఫోటన్ల వాట్సాప్‌లో ఇది అందుబాటులో ఉంది. అలాగే వీటితో పాటూ మెటా సంస్థ చాట్‌లిస్ట్‌లో ఫేవరెట్స్ ఆప్షన్‌ను కూడా తీసుకురాబోతున్నది. ఈఫీచర్‌తో యూజర్లు తమకు ఇష్టమైన వ్యక్తులను యాడ్ చేసుకోవచ్చును. దీని వలన తరచూ చాట్‌చేసే వారితో పాటు కాంటాక్ట్స్ మొత్తం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు.