Odisha: డిగ్రీ, పీజీ చదివే విద్యార్థుల కోసం కొత్త పథకం.. ఏటా రూ.9 వేలు సాయం

డిగ్రీ, పీజీ చదివే విద్యార్థుల కోసం ఒడిశా ప్రభుత్వం నూతన ఉన్నత అభిలాష (NUA)-ఒడిశా పేరుతో ఓ పథకం తీసుకురానుంది. ఈ పథకం కింద విద్యార్థులకు ప్రతి ఏడాది రూ.9 వేలు, విద్యార్థినులకు రూ.10 వేల చొప్పున అందించనున్నారు.

Odisha: డిగ్రీ, పీజీ చదివే విద్యార్థుల కోసం కొత్త పథకం.. ఏటా రూ.9 వేలు సాయం
New Update

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అయితే తాజాగా ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిగ్రీ, పీజీ చదివే విద్యార్థుల కోసం కొత్త స్కాలర్‌షిప్‌ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద అబ్బాయిలకు ప్రతి ఏడాది రూ.9 వేలు, అమ్మాయిలకు రూ.10 వేల చొప్పున అందించనున్నారు. ఇక ఎస్సీ/ఎస్టీ, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు చెందిన విద్యార్థులకు రూ. 10 వేలు.. విద్యార్థినులకు రూ.11 వేల చొప్పున అందించనున్నారు.

Also Read: MSP చట్టం హడావుడిగా తీసుకురాలేం: కేంద్రమంత్రి

జజ్‌పుర్‌లో నిర్వహించిన నువా ఓ ఫెస్టివల్‌లో 5టీ ఛైర్‌పర్సన్ వీకే పాండియన్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కేబినేట్‌ సమావేశంలో తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. నూతన ఉన్నత అభిలాష (NUA)-ఒడిశా పేరుతో అమలు చేసే ఈ పథకం ద్వారా యువతకు నిరంతరం నైపుణ్యాలు అందిస్తూ.. కొత్త అవకాశాలతో సాధికారత సాధించడానికి కృషి చేయడమే లక్ష్యమని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీల్లోని అండర్‌ గ్రాడ్యుయేట్, పోస్ట్‌ గ్యాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌ల విద్యార్థులతో పాటు ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉన్న సంస్కృత కళాశాలలు, ప్రభుత్వ, ప్రభుత్వేతర ఎయిడెడ్‌ కళాశాలల విద్యార్థులకు కూడా ఈ స్కాలర్‌షిప్‌ అందిస్తామని తెలిపారు.

విద్యార్థుల తల్లిదండ్రులు టాక్స్‌ చెల్లిస్తున్నవారు, శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులైతే.. వారికి ఈ స్కాలర్‌షిప్‌ రాదని చెప్పారు. ప్రస్తుతం విద్యా సంవత్సరానికి సంబంధించి NUA-O స్కాలర్‌షిప్ డబ్బును ఫిబ్రవరి 20 నుంచి అర్హులైన విద్యార్థులకు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫథకం ద్వారా ఒడిశాలో మొత్తంగా 4.5 లక్షల మంది డిగ్రీ విద్యార్థులు అలాగే.. 32 వేల మంది పోస్ట్ గ్రాడ్యుయేట్‌ విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.

Also Read: మోదీ వల్ల కానిది.. షారుఖ్‌ ఖాన్‌ చేశారు: సుబ్రహ్మణ్య స్వామి

#telugu-news #students #national-news #odisha-news
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe