Plastic Pollution: ప్లాస్టిక్‌ రిజర్వాయర్లుగా మారిపోయిన సముద్రాలు

ప్లాస్టిక్ రిజర్వాయర్‌గా సముద్రాలు మారిపోయాయని.. 30 లక్షల నుంచి 1.1 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రం లోపల పేరుకుపోయినట్లు తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో బయటపడింది. ప్రతి నిమిషం ఓ ట్రక్‌ సైజ్‌లో ప్లాస్టిక్‌ సముద్రంలో కలుస్తోందని తేలింది.

New Update
Plastic Pollution: ప్లాస్టిక్‌ రిజర్వాయర్లుగా మారిపోయిన సముద్రాలు

సముద్రాల్లో రోజురోజుకి ప్లాస్టిక్ వ్యర్థాలు కలుస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఇవి ఎంతమేరకు ఉన్నాయి అనే దానిపై నిపుణులు అంచనా వేసారు. ప్లాస్టిక్ రిజర్వాయర్‌గా సముద్రాలు మారిపోయాయని.. 30 లక్షల నుంచి 1.1 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రం లోపల పేరుకుపోయినట్లు తెలిపారు. ఆస్ట్రేలియ జాతీయ సైన్స్ ఏజెన్సీ, యూనివర్సిటీ ఆఫ్‌ టొరొంటో పరిశోధకుల తాజా అధ్యయనం ఈ లెక్కను బయటపెట్టింది.

Also Read: బీ కేర్ ఫుల్.. కొత్త వైరస్‌ కలకలం..

ప్రతి నిమిషం ఓ ట్రక్‌ పరిమాణం అంతా ప్లాస్టిక్‌ సముద్రంలో కలుస్తోందని ఈ పరిశోధకులు బృందం అంచనా వేసింది. పాస్టిక్‌ వ్యర్థాలు సముద్రం లోపల ఎంత ఉన్నాయి అని తెలిపిన మొదటి పరిశోధన ఇదేనని సీనియర్‌ పరిశోధకుడు డెనిస్‌ హార్డెస్టీ వెల్లడించారు. ప్రస్తుతం ప్లాస్టిక్ వ్యర్థాలకు సముద్రాలు రిజర్వాయర్లుగా మారిపోయినట్లు పేర్కొన్నారు. మైక్రో ప్లాస్టిక్‌ కాకుండా.. సంచలు, వలలు, కప్పులు ఇంకా చాలా వస్తువులు ఎంతమేరకు ఉన్నాయనేది తెలుసుకున్నామని తెలిపారు.

Also Read: ఈరోజు సంపూర్ణ సూర్యగ్రహణం.. భారత్‌లో కనిపిస్తుందా ?

Advertisment
Advertisment
తాజా కథనాలు