Uttar Pradesh : మరో ఘోరం.. నర్సు పై హత్యాచారం..తొమ్మిదిరోజులకు మృతదేహం గుర్తింపు!

ఉత్తరాఖండ్ లోని రుద్రాపూర్‌ పట్టణంలో నర్సుగా పని చేస్తున్న ఓ మహిళ (33) ను ధర్మేంద్ర అనే రోజూవారీ కూలీ హత్యాచారం చేశాడు. జులై 30న ఈ దారుణం జరగగా..ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Wife Murder: అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త
New Update

Kolkata :  పశ్చిమ బెంగాల్ (West Bengal) రాజధాని కోల్‌ కతాలో కొద్ది రోజుల క్రితం ట్రైనీ డాక్టర్‌ (Trainee Doctor) పై జరిగిన సామూహిక హత్యాచారానికి ఇప్పటికీ దేశ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే మరో దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌ లో వెలుగులోకి వచ్చింది. రుద్రాపుర్‌ పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో నర్సు (Nurse) గా చేస్తున్న మహిళ అత్యాచారం , హత్యకు గురైంది.

గత నెల 30 న తాను పని చేస్తున్న ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన ఆమె కనిపించకుండా పోయింది. దీంతో ఈ విషయం గురించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా...ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.

ఉత్తరాఖండ్‌ కు సరిహద్దు ఉత్తరప్రదేశ్‌  (Uttar Pradesh) లోని బిలాస్‌ పూర్‌ పట్టణంలో 33 ఏళ్ల ఓ మహిళా నర్సు అద్దెగదిలో కుమార్తెతో కలిసి నివాసం ఉంటుంది. ఈ క్రమంలోనే జులై 30న తాను చేస్తున్న రుద్రాపూర్‌ ఆసుపత్రి నుంచి తన విధులు నిర్వహించుకొని రాత్రి పూట ఇంటికి బయల్దేరింది. అయితే ఆమె ఎంత సమయం గడిచినప్పటికీ ఇంటికి రాకపోవడంతో ఆమె సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఎనిమిది రోజుల తరువాత ఆమె ఉండే అపార్ట్‌మెంట్‌ కు సమీపంలోని పొదల్లో మృతదేహాన్ని గుర్తించారు. ఆ తరువాత ఆమె మృతదేహాన్ని శవపరీక్షకు పంపగా..ఆమె హత్యాచారానికి గురైనట్లు తెలిసింది. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడు ధర్మేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. నిందితుడ్ని విచారించగా..నిజం ఒప్పుకున్నాడు.

బాధితురాలిని అనుసరించిన నిందితుడు... ఆమె ఇంటి సమీపంలోనే మెడకు చున్నీ బిగించి హత్య చేసి.. ఆ తరువాత అత్యాచారం చేసినట్లు తెలిపాడు. ఆ తరువాత ఆమెఫోన్‌, నగలు, డబ్బుతో అక్కడి నుంచి పారిపోయినట్లు వివరించారు. మృతురాలి ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా పోలీసులు నిందితుడ్ని పట్టుకున్నారు. నిందితుడు రోజూవారీ కూలీగా పనిచేస్తున్నాడు.

Also Read: అర్థరాత్రి ఆర్టీసీ బస్సు బోల్తా.. 29 మంది ప్రయాణికులు!

#murder #rape #uttarapradesh #nurse
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe