Corona Cases: వెయ్యి దాటిన జేఎన్‌ 1 సబ్‌ వేరియంట్ కరోనా కేసులు.. 16 రాష్ట్రాలకు వ్యాప్తి..

కొవిడ్-19 సబ్‌ వేరియంట్ జేఎన్‌-1 కేసులు వ్యాప్తి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో మొత్తం 16 రాష్ట్రాల్లో 1,013 కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో అత్యధికంగా 214 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. ఇక ఏపీలో 189, తెలంగాణలో 32 కేసులు నమోదైనట్లు తెలిపారు.

New Update
Corona Cases: వెయ్యి దాటిన జేఎన్‌ 1 సబ్‌ వేరియంట్ కరోనా కేసులు.. 16 రాష్ట్రాలకు వ్యాప్తి..

Covid cases: చైనాలో బయటపడ్డ కరోనా వైరస్ ప్రపంచ దేశాలను ఎలా అతాలకుతలం చేసిందో అందరికీ తెలిసిందే. కరోనా (Corona Virus) ప్రభావం తగ్గిపోయి ప్రజలందరూ సాధారణ జీవితం గడుపుతున్న కూడా కరోనా కేసులు మాత్రం ఆగిపోవడం లేదు. ఎప్పటికప్పుడు కరోనా కొత్త రూపాలను మార్చుకుంటూ వస్తోంది. తాజాగా దేశంలో బయటపడ్డ కొవిడ్-19 సబ్‌ వేరియంట్ జేఎన్‌-1 కేసులు (JN.1 Covid variant) వ్యాప్తి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు దేశంలోని 16 రాష్ట్రాల్లో జేఎన్-1 కేసులు నమోదయ్యాయి.

దేశంలో మొత్తం 1,013 కేసులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అయితే తాజాగా ఉత్తరప్రదేశ్‌లో కూడా ఈ వేరియంట్ వ్యాప్తి చెందినట్లు ‘ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్టియం' తెలిపింది. అంతేకాదు వివిధ రాష్ట్రాల్లో నమోదైన జేన్‌-1 కేసుల వివరాలను కూడా ఈ సంస్థ బయటపెట్టింది. ఇప్పటిదాకా కర్ణాటకలో అత్యధికంగా 214 కేసులు నమోదయ్యాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) 189 కేసులు నమోదు కాగా.. కేరళలో 154 వచ్చాయి. గుజరాత్ 76, మహారాష్ట్ర 70, గోవా 66, తెలంగాణ 32, రాజస్థాన్‌లో 32 కేసులు నమోదయ్యాయి.

Also Read: మొయినాబాద్‌ యువతి దహనం కేసులో సంచలన ట్విస్ట్‌

అలాగే ఛత్తీస్‌గఢ్‌లో 25, తమిళనాడు 22, ఢిల్లీ, 16, ఉత్తర్‌ప్రదేశ్‌ 6, హర్యాణా 5, ఒడిశా 3, పశ్చిమ బెంగాల్ 2, ఉత్తరాఖండ్‌ 1.. ఇలా 16 రాష్ట్రాల్లో కేసులు వెలుగుచూశాయి. ఇదిలాఉండగా 'జేఎన్‌ 1' సబ్‌ వేరియంట్‌ను ప్రత్యేకమైన ‘వేరియంట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇప్పటికే ప్రకటించింది. మరో విషయం ఏంటంటే ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నా కూడా.. ముప్పు మాత్రం తక్కువేనని తెలిపింది.

ప్రస్తుతం దేశంలో జేఎన్ సబ్‌ వేరియంట్ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ కూడా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ చెబుతోంది. అయితే కచ్చితంగా జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలని సూచిస్తోంది. ఇదిలాఉండగా.. గురువారం ఒక్కరోజులోనే 609 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారిన పడి కేరళలో ఇద్దరు చనిపోగా.. కర్ణాటకలో ఒకరు మృతి చెందారు. అయితే ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3, 368 ఉంది.

Also read: ప్రజాపాలన దరఖాస్తుల్లో తప్పులు ఉంటే… రేవంత్ కీలక ఆదేశాలు

Advertisment
తాజా కథనాలు