/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-2024-09-02T134717.257.jpg)
NTR Family Visited Keshavanatheshwara In Keradi : టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఇటీవలే ఫ్యామిలీతో కలిసి కర్ణాటకలోని (Karnataka) ఉడిపి శ్రీకృష్ణ మఠాన్ని దర్శించుకునేందుకు వెళ్లారు. దైవ దర్శనం కోసం అక్కడికి వెళ్లిన తారక్ ను కన్నడ హీరో రిషబ్ శెట్టి(Rishab Shetty), మర్యాదపూర్వకంగా రిసీవ్ చేసుకున్నారు. ఆ తర్వాత రిషబ్ స్వయంగా దగ్గరుండి ఎన్టీఆర్ ఫ్యామిలీకి దైవ దర్శనంలో సహకరించారు.
ಮೂಡುಗಲ್ಲು ಕೇಶವನಾಥೇಶ್ವರನ ದರ್ಶನ ಪಡೆದಾಗ.. ✨🙏🏼
A blessed journey to Keshavanatheshwara Temple Moodagallu ✨🙏🏼@tarak9999#PrashanthNeelpic.twitter.com/SWfP2TAWrk
— Rishab Shetty (@shetty_rishab) September 2, 2024
ముదగల్లు కేశవనాథేశ్వరుడిని దర్శించుకున్న తారక్
ఇక ఉడిపి శ్రీకృష్ణ మఠాన్ని దర్శించుకున్న అనంతరం తారక్ (NTR ) కర్ణాటకలోని ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తున్నారు. తాజాగా కెరాడిలోని ముదగల్లు కేశవనాథేశ్వరుడిని సతీసమేతంగా దర్శించుకున్నారు. ఎన్టీఆర్ తో పాటు రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్ తమ సతీమణీలతో ఆలయాన్ని దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను రిషబ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఇక తారక్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నారు. జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత కొరటాల శివ ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన మూవీ టీజర్ తారక్ యాక్షన్, లుక్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: Bigg Boss Telugu 8 Promo: మొదటి రోజే బిగ్ బాస్ ఇంట్లో శేఖర్ భాష రచ్చ.. సోనియాతో గొడవ - Rtvlive.com