NTR : తారక్‌ అభిమానులకు అదిరిపోయే న్యూస్‌.. నీల్‌ సినిమా పై బ్రేకింగ్‌ అప్డేట్‌!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం మరో సర్ప్రైజింగ్ అప్డేట్ వచ్చింది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా షూటింగ్ 2024 ఆగస్టు నుంచి మొదలుపెట్టనున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది.

New Update
NTR : తారక్‌ అభిమానులకు అదిరిపోయే న్యూస్‌.. నీల్‌ సినిమా పై బ్రేకింగ్‌ అప్డేట్‌!

Jr NTR Fans : మ్యాన్ ఆఫ్‌ మాసెస్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ (Jr NTR) నటించిన మోస్ట్‌ అవైటెడ్‌ సినిమా దేవర (Devara). ఈ సినిమాను టాలీవుడ్‌ (Tollywood) మాస్‌ డైరెక్టర్‌ కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా బిగ్గెస్ట్‌ యాక్షన్‌ సినిమాగా రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ సరసన బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) కథానాయికగా నటిస్తుంది. అలాగే బాలీవుడ్‌ స్టార్ సైఫ్‌ అలీఖాన్ ఈ సినిమాలో విలన్‌ గా చేస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమా నుంచి చిత్ర బృందం గ్లింప్స్‌ వీడియో రిలీజ్ చేయగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే సోమవారం (మే 20 ) ఎన్టీఆర్ ర్త్ డే సందర్భంగా ఒక రోజు ముందుగానే ఆదివారం నాడే ఈ చిత్రం నుండి “ఫియర్ సాంగ్” ను మేకర్స్ విడుదల చేసారు. ఈ సాంగ్ ప్రస్తుతం ట్రేండింగ్ లో ఉంది. ఈ సాంగ్ లో ఎన్టీఆర్ విజువల్స్ అదిరిపోయాయి. ఈ సాంగ్ వింటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం మరో సర్ప్రైజింగ్ అప్డేట్ వచ్చింది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) తో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీరి కాంబోలో సినిమాను ప్రకటించారు. తాజాగా నేడు ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా అప్డేట్ వైరల్ గా మారింది. ఈ సినిమా షూటింగ్ 2024 ఆగస్టు నుంచి మొదలుపెట్టనున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది.

Also read: చెలరేగిన ఎన్నికల హింస..14 మంది మృతి!

Advertisment
తాజా కథనాలు