Chandrababu: చంద్రబాబు భద్రత మీద కేంద్రహోంశాఖకు ఎన్ఎస్జీ నివేదిక

చంద్రబాబు అరెస్ట్, తరువాత జరిగిన పరిణామాల మీద కేంద్ర హోంశాఖకు ఎన్ఎస్జీ నివేదిక సమర్పించింది. సెప్టెంబర్ 8వ తేదీ అర్ధరాత్రి నుంచి 10వ తేదీ అర్ధరాత్రి 1 గంట వరకు ఏం జరిగింది అన్న దాని మీద నివేదిక ఇచ్చింది.

New Update
Chandrababu: చంద్రబాబు భద్రత మీద కేంద్రహోంశాఖకు ఎన్ఎస్జీ నివేదిక

NSG submits report on Chandrababu Arrest: ఆంధ్రప్రదదేశ్ రాష్ట్రంలో జరిగిన కీలక పరిణామాల గురించి ఎన్ఎస్జీ కేంద్రహోంశాఖకు డీటెయిల్డ్ నివేదిక పంపింది. చంద్రబాబు నాయుడు అరెస్టయిన దగ్గర నుంచి రెండు రోజులు ఏం జరిగిందో మొత్తం నివేదికలో సమర్పించింది. అంటే సెప్టెంబర్ 8వ తేదీనుంచి 10 వతేదీ అర్ధరాత్రి 1గంట వరకూ జరిగిన విషయాన్ని మొత్తం నివేదికలో పొందుపరిచింది. ఏసీబీ కోర్టు రిమాండ్, జైల్లో భద్రత వంటి విషయాల గురించి కూడా అందులో వివరించింది. అలాగే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రస్తుతం చంద్రబాబు పరిస్థితి ఏంటి, ఆయనకు భద్రత ఏ విధంగా ఏర్పాటు చేశారనే విషయాన్ని కూడా ప్రస్తావించింది.

తొమ్మిదో తేదీ ఉదయం 6గంటలకు సీఐడీ బాబును అరెస్ట్ చేసింది. అక్కడ నుంచి ఎన్ఎస్జీ ప్రోటెక్షన్ లోనే ఆయనను రోడ్డు మార్గంలో విజయవాడ తరలించారు. ఈ మొత్తం విషయాన్ని డీటెయిల్డ్ గా కేంద్రహోంశాఖకు నివేదికలో తెలిపింది. రాజమండ్రి జైల్లో కొన్ని భద్రతా లోపాలున్నాయనే విషయాన్ని కూడా అందులో ప్రస్తావించింది. అయితే మొత్తం చంద్రబాబు భద్రతా ఏర్పాట్లు అన్నీ తమ ఆధీనంలోనే జరుగుతున్నాయని ఎన్ఎస్జీ కేంద్రహోంశాఖకు, ఎన్ఎస్జీ ప్రధాన కార్యాలయానికి నివేదికను సమర్పించింది.

Also Read: విజయనగరంలో టెన్షన్‌..జనసైనికులు అరెస్ట్ !!

Advertisment
Advertisment
తాజా కథనాలు