Maldives: మాల్దీవుల్లో తాగునీటి కోరత.. 1500 టన్నుల నీటిని పంపిన చైనా..

మాల్దీవుల్లో తాగునీటి కొరత ఏర్పడింది. ఇందుకోసం చైనా ఆ దేశానికి 1500 టన్నుల తాగునీటిని పంపింది. టిబెట్‌లోని హిమానీ నదాల నుంచి నీటిని సేకరించి మాల్దీవులకు పంపించింది చైనా. 2014లో భారత్‌ కూడా మాల్దీవులకు 2375 టన్నుల నీటిని అందించింది.

New Update
Maldives: మాల్దీవుల్లో తాగునీటి కోరత.. 1500 టన్నుల నీటిని పంపిన చైనా..

Maldives: ఇటీవల భారత్‌, మాల్దీవులు మధ్య ద్వైపాక్షిక వివాదాలు చెలరేగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మాల్దీవుల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అక్కడ తాగునీరు లేక జనాలు అవస్థలు పడుతున్నారు. దీనిపై స్పందించిన చైనా.. ఆ దేశానికి 1500 టన్నుల తాగునీటిని పంపింది. ఇందుకోసం టిబెట్‌లోని హిమానీ నదాల నుంచి చైనా ఈ నీటిని సేకరించింది. అలాగే మాల్దీవులకు అన్నివిధాలుగా సాయం చేస్తామని ప్రకటన చేసింది. గత ఏడాది నవంబర్‌లో టిబెట్‌ అటానమస్‌ రీజియన్‌ ఛైర్మన్‌ యాన్‌ జిన్హాయ్‌ మాల్దీవుల్లో పర్యటన చేశారు. ఈ సందర్భంగా తాగునీటి కొరతను ఎదుర్కోనేందుకు మాల్దీవులకు సాయం చేస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు.

Also Read: సివిల్స్‌ పరీక్షల కోసం ఏళ్ల తరబడి కష్టబడటం వృథా: సంజయ్ సన్యాల్

అయితే మాల్దీవులతో చైనా ఇప్పటికే సైనిక ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం బాష్ప వాయు గోళాలు, పెప్పర్‌ స్ర్పే వంటి వాటిని చైనా తమకు ఫ్రీగా అందిస్తుందని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ మయిజ్జు తెలిపారు. అలాగే తమ ప్రజలకు సైనిక శిక్షణకు కూడా ఇస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ద్వీప దేశంలో తాగునీటి కొరత రావడంతో.. ఇందుకోసం చైనా సాయం చేసింది. దీనిపై స్పందించిన మాల్దీవుల విదేశాంగ శాఖ.. చైనా పంపిన నీటితో తమ దేశంలో తాగునీటి కొరతను అధిగమించవచ్చిని పేర్కొంది. ఈ నీటిని అన్ని ప్రాంతాలకు త్వరలో సరఫరా చేస్తామని తెలిపింది.

ఇదిలాఉండగా.. మాల్దీవులకు పొరుగున ఉండే దేశాలు తాగునీటి సాయం చేయడం ఇది మొదటిసారి కాదు. 2014లో ఆ దేశంలో తాగునీరు, మురుగునీటిని నిర్వహించే సంస్థలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ సమయంలో భారత్‌.. ఆపరేషన్ నీర్‌ పేరుతో మాల్దీవులకు తొలివిడుతలో 375 టన్నుల తాగునీటిని అందించింది. ఆ తర్వాత మరో రెండు వేల టన్నుల నీరు అందజేసింది.

Also Read: ఒక్క బెంగళూరు మాత్రమే కాదు.. హైదరాబాద్‌ కూడా ఆ లిస్ట్‌ లో !

Advertisment
తాజా కథనాలు