Govt Jobs: నిరుద్యోగులకు శుభవార్త..ఈ ప్రభుత్వ సంస్థలో వెయ్యికి పైగా పోస్టులకు రిక్రూట్ మెంట్...పూర్తి వివరాలివే..!! By Bhoomi 01 Oct 2023 in జాబ్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి నేషనల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (NCL) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ప్రభుత్వరంగ సంస్థ నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (NCL) ఇటీవల అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ కోసం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం, ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా, మొత్తం 1140 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు వెల్లడించింది. నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ ఈ అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తును 5 అక్టోబర్ 2023 నుండి ప్రారంభం కానున్నట్లు తెలిపింది. ఈ దరఖాస్తులు ఆన్ లైన్ విధానం ద్వారా ఉంటుందని తెలిపింది. అభ్యర్థులు NCL 15 అక్టోబర్ 2023 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే చివరి తేదీ అక్టోబర్ 15. ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదవాలని.. ఆ తర్వాత మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎందుకంటే తప్పుగా నింపిన ఫారమ్ కంపెనీ అంగీకరించదు. ఇది కూడా చదవండి: ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ దే అధికారం.. సంచలన సర్వే.. సీట్ల లెక్కలివే..!! ఖాళీల వివరాలు: ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 1140 అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో ఎలక్ట్రానిక్ మెషీన్ 13, ఎలక్ట్రీషియన్ 370, ఫిట్టర్ 543, వెల్డర్ 155, ఆటో ఎలక్ట్రీషియన్ 12, మోటార్ మెకానిక్ 12 పోస్టులు ఉన్నాయి. వయో పరిమితి: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థి కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 26 సంవత్సరాలుగా పేర్కొన్నారు. 31 ఆగస్టు 2023ని బేస్‌గా పరిగణించి వయస్సు లెక్కించబడుతుందని తెలిపింది. అదే సమయంలో, OBC, EWS, SC, ST, రిజర్వ్ కేటగిరీలకు కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు లభిస్తుంది. ఇది కూడా చదవండి: విద్యార్థులకు శుభవార్త…స్కాలర్ షిప్ దరఖాస్తుల గడువు పెంపు..పూర్తి వివరాలు ఇవే..!! ఎంపిక ప్రక్రియ: 10వ తరగతి మార్కులు, ఐటీఐ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని చూడవచ్చు. ఎలా దరఖాస్తు చేయాలి: -అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://www.nclcil.in/ కి వెళ్లండి . -దీని తర్వాత రిక్రూట్‌మెంట్ లింక్‌పై క్లిక్ చేయండి. -ఇప్పుడు వ్యక్తిగత వివరాలను నమోదు చేసి సమర్పించు బటన్‌పై క్లిక్ చేయండి. -ఆపై మీ యూజర్ ఐడి, పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేయండి. -ఆపై దరఖాస్తు ఫారమ్‌ను నింపి సమర్పించండి. -దీని తర్వాత మీ ఫీజు చెల్లించండి. -చివరగా, ఫారమ్ కాపీని డౌన్‌లోడ్ చేసి..భవిష్యత్ అవసరాల కోసం దానిని మీ వద్ద ఉంచుకోండి. #government-jobs #jobs #job #recruitment #ncl మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి