NTPC Jobs:ఎన్టీపీపీలో 100 ఇంజనీరింగ్ ఉద్యోగాలు నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మళ్ళీ శుభవార్త చెప్పింది. అన్నిరకాల ఉద్యోగాల్లో ఖాళీలను భర్తా చేస్తూ వస్తున్న గవర్నమెంట్ తాజాగా ఎన్టీపీసీలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 100 ఇంజనీరింగ్ పోస్టులను ఇందులో భర్తీ చేయనున్నారు. By Manogna alamuru 02 Jan 2024 in జాబ్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Government Jobs:కేంద్రప్రభుత్వం ఖాళీ అయిన ఉద్యోగాలను ఎప్పటికప్పుడూ భర్తీ చేస్తూ వస్తోంది. ఒకదాని తర్వాత ఒకటి పోస్టుల నోటిఫికేషన్‌ను విడుదల చేస్తూ వస్తోంది. తాజాగా ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఎన్టీపీసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్ధులు జనవరి ౩లోపు అధికార వెబ్ సైట్‌లో అప్లై చేసుకోవాలని చెప్పింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా వివిధ భాగాలకు చెందిన మొత్తం 100 ఇంజనీరింగ్ పోస్ట్‌లను ఎన్టీపీసీ భర్తీ చేయనుంది. రేపటిలోగా ntpc.co.inలో అప్లై చేసుకోవాలి. Also Read:జపాన్‌లో ఎందుకు ఎక్కువ భూకంపాలు వస్తాయి? కారణం ఇదే. మొత్తం 100 ఉద్యోగాలలో సివిల్ కన్స్ట్రక్షన్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఉన్నాయి. అన్నింటికీ గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి కనీసం 50 మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. సివిల్ కన్స్ట్రక్షన్ విభాగంలో జాబ్ కోసం సివిల్/కన్స్ట్రక్షన్ బీఈ/బీటెక్ డిగ్రీ ఉత్తీర్ఱత సాధించి ఉండాలి. మెకానికల్ ఉద్యోగం కోసం మెకానికల్/ప్రొడక్షన్లో బీఈ/ బీటెక్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎలక్ట్రికల్ విభాగంలో జాబ్స్ కోసం బీఈ/బీటెక్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ కేటగిరీ అభ్యర్ధులు 300 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్ధులకు దరఖాస్తు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. #central-government #jobs #engeneering #ntpc మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి